Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగాళాఖాతంలో అల్పపీడనం: హైదరాబాద్ సహా పలు జిల్లాలకు హెచ్చరికలు!

బంగాళాఖాతంలో అల్పపీడనం: హైదరాబాద్ సహా పలు జిల్లాలకు హెచ్చరికలు!

వార్త 2 weeks ago

Telangana Rains: బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.

దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు మరియు పిడుగులు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Read Also :Hyderabad Rain: ఉన్నట్టుండి కుండపోత.. మరుక్షణమే ఆకాశం నిర్మలం.. హైదరాబాద్‌లో విచిత్ర వాతావరణం!

వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలు

  1. తొలుత ప్రభావం చూపిన జిల్లాలు:మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల.
  2. వర్షాలు విస్తరించే జిల్లాలు:కరీంనగర్, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట.
  3. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే జిల్లాలు:హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం.

హైదరాబాద్ నగరంలో పరిస్థితి

హైదరాబాద్ నగరంలోనూ నేడు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే శనివారం సాయంత్రం పటాన్‌చెరు, అమీన్‌పూర్, లింగంపల్లి, మియాపూర్, కొండాపూర్, బాచుపల్లి, నిజాంపేట్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Telangana Rains: ప్రజలు, రైతులకు వాతావరణ శాఖ కీలక సూచనలు

  • రక్షణ చర్యలు: వర్షం మరియు ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, సైన్ బోర్డులు/హోర్డింగుల కింద నిలబడకూడదు.
  • పిడుగుల ప్రమాదం: పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు.
  • ప్రయాణాలు: అత్యవసరమైతే తప్ప వర్ష సమయంలో ప్రయాణాలు చేయకపోవడం శ్రేయస్కరం.
  • రైతులకు హెచ్చరిక: రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. స్తంభించిన ట్రాఫిక్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha