Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bangladesh: తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!

Bangladesh: తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!

వార్త 4 months ago

బంగ్లాదేశ్ (Bangladesh) నూతన ప్రధానిగా ఎన్నికైన తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఈ కీలక కార్యక్రమంలో స్పీకర్ పాల్గొనడం ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన, చిరకాల స్నేహానికి నిదర్శనమని విదేశాంగ శాఖ తెలిపింది. 'చరిత్ర, సంస్కృతి, పరస్పర గౌరవంతో ముడిపడి ఉన్న పొరుగు దేశంగా, తారిఖ్ రెహమాన్ నాయకత్వంలో ఏర్పడుతున్న ఎన్నికైన ప్రభుత్వాన్ని భారత్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న బంగ్లాదేశ్‌కు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది' అని ప్రకటనలో పేర్కొంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తరఫున గెలిచిన తారిఖ్ ఢాకాలో ఈ నెల (ఫిబ్రవరి) 17న ప్రమాణం చేయనున్న విషయం తెలిసిందే.

Phone Pay: ఇన్‌స్టంట్ లోన్స్: మీ స్మార్ట్‌ఫోన్ నుంచే తక్షణ రుణం

మరో 12 దేశాలను ఆహ్వానించింది

2024లో అవామీ లీగ్ పార్టీ నేతృత్వంలోని షేక్ హసీనా ప్రభుత్వం.. అంతర్గత ఘర్షణల కారణంగా పతనమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన మొదటి జాతీయ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో బీఎన్‌పీ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్‌తో పాటు మరో 12 దేశాలను ఆహ్వానించింది.

అందులో చైనా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, మలేషియా, శ్రీలంక ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.297 పార్లమెంట్ స్థానాలు ఉన్న బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ ఏకంగా 209 స్థానాలను గెలుచుకుంది. దీంతో దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇక బీఎన్‌పీ మిత్రపక్షమైన జమాత్ ఏ ఇస్లామీ 68 స్థానాలు దక్కించుకుంది. మరోవైపు.. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీని ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Barack Obama: ఏలియన్స్ నిజంగానే ఉన్నారా! ఒబామా ఏమన్నారంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha