Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Barack Obama: ఏలియన్స్ నిజంగానే ఉన్నారా! ఒబామా ఏమన్నారంటే?

Barack Obama: ఏలియన్స్ నిజంగానే ఉన్నారా! ఒబామా ఏమన్నారంటే?

వార్త 4 months ago

దో ఒక గ్రహంపై గ్రహాంతరవాసులు ఉన్నారనే విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తున్నానని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama) తెలిపారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన, ఏలియన్స్‌ను ఏరియా 51లో అమెరికా నిర్బంధించిందనే విమర్శలను ఖండించారు.

ఆ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. దీనిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. దశాబ్దం క్రితం యూఎస్ ఎయిర్ ఫోర్స్ రీపర్ డ్రోన్లు సేకరించిన రాడార్ రికార్డింగ్‌లలో మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలపై అసాధారణ జీవుల ఉనికి కనిపించిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

Security Summit: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు చేదు అనుభవం

సైనిక శిక్షణ

దీనిపై కూడా ఒబామా స్పందించారు. గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించిన పలు రికార్డులు అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తాను అధికారంలో ఉన్న సమయంలో కూడా సమాచారం లేదని అన్నారు. అమెరికాలోని నెవాడలో ఉన్న 'ఏరియా 51' అత్యంత రహస్య ప్రాంతం. ఇక్కడ అమెరికా సైన్యం, శాస్త్రవేత్తలు, ఆయుధాలు సహా పలు రకాల సాంకేతికతలను పరీక్షిస్తారు. సైనిక శిక్షణ కూడా ఇస్తారు. ఈ స్థావరాన్ని 1955లలో ఏర్పాటు చేశారు. నెవాడ ప్రాంతంలో 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో 'ఏరియా 51' ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha