CM Revanth Delhi Visit: తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ప్రపంచ పటంలో నిలబెట్టే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం ఢిల్లీలో కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.
కుమారస్వామితో కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా 'తెలంగాణ రైజింగ్-2047' విజన్ డాక్యుమెంట్‌లో భాగంగా రూపొందించిన పలు పారిశ్రామిక ప్రతిపాదనలను ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా బయ్యారంలో పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని, దీనివల్ల దేశంలో ఉక్కు కొరత తగ్గడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also:Telangana Health News: తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చాలి
CM Revanth Delhi Visit: హైదరాబాద్‌లో ఈవీ హబ్! కేంద్ర మంత్రితో రేవంత్ రెడ్డి భేటీ.
Steel Plant in Bayyaram… EV Hub in Hyderabad!
హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఒక అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. పాత వాహనాల స్క్రాప్ నుండి ఉక్కును తయారు చేసే రీసైక్లింగ్ పరిశ్రమతో పాటు, హైడ్రోజన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే గ్రీన్ స్టీల్ క్లస్టర్‌ను నగరంలో నెలకొల్పాలని కోరారు. అలాగే పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈవీ బ్యాటరీ తయారీ కేంద్రాలను, రక్షణ మరియు ఆటోమొబైల్ రంగాలకు అవసరమైన విడిభాగాల పరిశ్రమలను తెలంగాణకు కేటాయించాలని విన్నవించారు. 2034 నాటికి హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు కేంద్రం నుండి పూర్తి సాంకేతిక సహకారం కావాలని ఆయన కోరారు.
వీటితో పాటు అత్యాధునిక రోబోటిక్స్, మెషిన్ టూల్స్ తయారీ కోసం ప్రత్యేక పార్కులను, ఆధునిక పారిశ్రామిక నైపుణ్యాలను యువతకు నేర్పించేందుకు జాతీయ స్థాయి విద్యాసంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో కేంద్ర మంత్రులను కోరారు. ఈ చర్చల్లో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా పాల్గొని రాష్ట్ర ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

