Dailyhunt
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చాలి

తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చాలి

వార్త 4 days ago

Telangana Health News: ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపిహెచ్ఎస్)కు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొం దించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ డీసీహెచ్ఎస్) బలోపేతం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ సమావేశం మంత్రి అధ్యక్షతన సెక్రటేరియట్లో శుక్రవారం జరిగింది.

Read Also : Telangana Aerospace Sector Development: గ్లోబల్ హబ్‌గా మార్చడమే లక్ష్యం.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!

 Telangana Health News: The shape of government hospitals in Telangana should be changed

సమావేశంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ చైర్మన్, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. టీవీవీపీని డైరెక్టరేట్ గా ఇటీవలే సెకండరీ హెల్త్ కేర్ మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. పేషెంట్లకు వారి నివాసాలకు సమీపంలోనే, వారి సొంత జిల్లాలోనే ట్రీట్మెంట్ అందించాలన్నది ప్రభుత్వ లక్ష ్యమని అందుకనుగుణంగా సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (ఐపీ హెచ్ఎస్) అనుగుణంగా అన్ని హాస్పిటల్స్ హెన్ఆర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్, డయా గ్నస్టిక్స్, డ్రగ్స్ స్టాండర్డ్ ఉండాలని సూచించారు.

వైద్య ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొం దించాలన్నారు. టీవీవీపీ పోస్టులు, సిబ్బందిని రీడిప్లాయ్ మెంట్ చేసేటప్పుడు ఐపీ హెచ్ఎస్ నిబంధన లను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవా లన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో తనిఖీలు చేసి.. అవసరమైన చర్యలు చేపట్టేందుకు నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీలతో మంత్రి సమావేశం నిర్వహించారు. కమిటీల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో హాస్పిటళ్లలో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు, ఫ్యాన్లు, ఏసీలు, మంచి నీటి వసతి, ఫైర్ అలార్మింగ్ సిస్టమ్ వంటి వాటిని పరిశీలించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

కాళేశ్వరం పునరుద్ధరణపై సర్కార్ స్పీడ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha