Dailyhunt
బెడ్ రూంలో భార్య.. బాత్ రూంలో భర్త ఆత్మహత్య

బెడ్ రూంలో భార్య.. బాత్ రూంలో భర్త ఆత్మహత్య

వార్త 1 week ago

Bapatla Couple Suicide: బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేటపాలెం మండలంలో ఓ యువ దంపతులు చిన్నారిని అనాథను చేస్తూ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య.. 14 నెలల చిన్నారి అనాథ

Read Also: Visakha Express Assault Case Updates: విశాఖ ఎక్స్‌ప్రెస్ అత్యాచార ఘటన.. నిందితుడు అరెస్ట్

వేటపాలెం మండలం రావురిపేట గ్రామానికి చెందిన మాజేటి ప్రభాకర్, పార్వతి దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 14 నెలల వయసున్న పాప ఉంది. అయితే, గత కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం భార్య పార్వతి తన పాపను పక్కింటి వారికి ఇచ్చి ఇంటి లోపలికి వెళ్లింది.

చాలా సేపటి వరకు పార్వతి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన ప్రభాకర్ సోదరుడు ఇంటికి వెళ్లి చూడగా లోపల గడియ పెట్టి ఉంది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా దంపతులిద్దరూ విగతజీవులుగా కనిపించారు.

Bapatla Couple Suicide: వేర్వేరు గదుల్లో ఉరివేసుకుని మృతి

ప్రమాద స్థలంలో భార్య పార్వతి బెడ్ రూంలో ఉరివేసుకుని ఉండగా, భర్త ప్రభాకర్ బాత్‌రూంలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. ఒకే ఇంట్లో వేర్వేరు చోట్ల ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం విషాదకరం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. అమ్మానాన్నలు ఇద్దరూ మరణించడంతో 14 నెలల చిన్నారి పరిస్థితి చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సింగూరు ప్రాజెక్టులో దూకి వ్యక్తి ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha