Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగాల్ పోలింగ్‌లో 'కమలం' మాయం? EVMలపై టేపులు వేసి అడ్డుకుంటున్నారని BJP ఆరోపణ!

బెంగాల్ పోలింగ్‌లో 'కమలం' మాయం? EVMలపై టేపులు వేసి అడ్డుకుంటున్నారని BJP ఆరోపణ!

వార్త 1 month ago

West Bengal Elections: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా డైమండ్ హార్బర్ పరిధిలోని ఫల్తా నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

పలు పోలింగ్ బూత్‌లలో ఈవీఎం (EVM) మెషీన్లపై బీజేపీ గుర్తు అయిన 'కమలం' కనిపించకుండా అధికారులు అడ్డుకుంటున్నారని బీజేపీ పశ్చిమ బెంగాల్ కో-ఇన్‌ఛార్జ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. ఓటర్లు కమలం గుర్తుకు ఓటు వేయకుండా ఉండేందుకు, ఆ గుర్తుపై టేపులు అంటించారని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.

Read Also: Bengal Election 2026 Phase 2: బెంగాల్ రెండో దశ ఎన్నికలు.. 11 గంటలకే 40 శాతానికి చేరువలో ఓటింగ్

టీఎంసీ వ్యూహం.. రీపోలింగ్‌కు డిమాండ్

స్థానిక అధికారుల అండతో తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతలు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని మాలవీయ మండిపడ్డారు. గతంలో అభిషేక్ బెనర్జీ గెలుపు కోసం కూడా ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించారని ఆయన విమర్శించారు. అక్రమాలు జరిగిన అన్ని బూత్‌లలో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తూ కొన్ని వీడియోలను కూడా సాక్ష్యంగా జత చేశారు.

West Bengal Elections: స్పందించిన ఎన్నికల సంఘం

బీజేపీ చేసిన ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించింది. బటన్ల ట్యాంపరింగ్‌పై వచ్చిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. ఒకవేళ విచారణలో ఆరోపణలు నిజమని తేలితే, ఆయా పోలింగ్ బూత్‌లలో పోలింగ్‌ను రద్దు చేసి, తిరిగి పోలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

పిల్లలూ! మీకు బతకాలని లేదా? ఏంటి ఈ ప్రయాణం?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha