Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగాల్‌లో సింగం వర్సెస్ పుష్ప: యూపీ IPS అధికారికి TMC నేత వార్నింగ్..

బెంగాల్‌లో సింగం వర్సెస్ పుష్ప: యూపీ IPS అధికారికి TMC నేత వార్నింగ్..

వార్త 1 month ago

West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో సినిమా డైలాగులు పేలుతున్నాయి. యూపీకి చెందిన 'ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్', ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల సంఘం అబ్జర్వర్‌గా నియమించడంతో అక్కడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

ముఖ్యంగా డైమండ్ హార్బర్ పరిధిలోని ఫాల్టాలో ఈ వివాదం ముదిరింది.

Read Also:Karnataka school rules : స్కూళ్లలో డ్యాన్స్‌లపై కొత్త నిబంధనలు… కర్ణాటక కీలక నిర్ణయం

వివాదానికి కారణం ఏంటి?

ఓటర్లను భయపెడుతున్నారనే ఫిర్యాదులతో అజయ్ పాల్ శర్మ నేరుగా టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఇంటికి వెళ్లారు. “ఓటర్లను ఇబ్బంది పెడితే గట్టి చర్యలు ఉంటాయి” అని ఆయన ఖాన్ బంధువులకు వార్నింగ్ ఇచ్చారు.

West Bengal: పుష్ప స్టైల్‌లో కౌంటర్

ఈ హెచ్చరికలపై జహంగీర్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఇది బెంగాల్, అతను ‘సింగం’ అయితే, నేను ‘పుష్ప’. ఫల్తాలో బీజేపీ మోహరించిన యూపీ పోలీసు అధికారుల నుండి ఎలాంటి బెదిరింపులు లేదా ఒత్తిడిని సహించబోమన్నారు. వారు పోలీసు బలగాలతో వచ్చి తన పైనా, తన మనుషులపైనా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కాదన్నారు. శర్మ తన కుటుంబాన్ని “బెదిరించడానికి” తన పార్టీ కార్యాలయానికి, నివాసానికి వచ్చారని ఖాన్ ఆరోపించారు.

 Ajay Pal Sharma IPS Bengal Election

ఇది ఒక పోలీస్ అబ్జర్వర్ విధా అని ప్రశ్నించారు. అతను ఏదైనా చెప్పాలనుకుంటే, ఎస్పీకి లేదా ఐసీకి చెప్పాలి, ఒక పోలీస్ అబ్జర్వర్ ఇళ్లకు వెళ్లి ప్రజలను బెదిరించవచ్చని ఎన్నికల కమిషన్లో ఎలాంటి రూల్ లేదన్నారు.వారు గెలవలేమని తెలిసి టీఎంసీ కార్యకర్తలను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ తాము భయపడబోమన్నారు. ఆ తర్వాత సీఆర్పీఎఫ్ వాహనాలతో శర్మ కాన్వాయ్ వెళ్తుండగా.. టీఎంసీ మద్దతుదారులు జై బంగ్లా నినాదాలు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మేఘాలయ హనీమూన్ హత్య కేసు.. సోనమ్‌కు బెయిల్ మంజూరు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha