Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మేఘాలయ హనీమూన్ హత్య కేసు.. సోనమ్‌కు బెయిల్ మంజూరు

మేఘాలయ హనీమూన్ హత్య కేసు.. సోనమ్‌కు బెయిల్ మంజూరు

వార్త 1 month ago

Meghalaya Honeymoon Murder Case Bail: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్‌కు ఊరట లభించింది. గత మూడుసార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురవ్వగా, తాజాగా షిల్లాంగ్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

Read Also: Gujarat election results : గుజరాత్‌లో బీజేపీ సునామీ… ఆప్, కాంగ్రెస్ క్లీన్ బౌల్డ్

Meghalaya Honeymoon Murder Case Bail: అసలేం జరిగింది?

గతేడాది మే నెలలో మధ్యప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ, తన భార్య సోనమ్‌తో కలిసి మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌కు హనీమూన్‌కు వెళ్లారు. అక్కడ సోహ్రా ప్రాంతంలో వీరిద్దరూ అదృశ్యం కాగా, ఆ తర్వాత ఒక లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది.ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. సోనమ్ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది.

 Raja Raghuvanshi Murder Sonam Bail

రాజాను వదిలించుకోవడానికి వారు గతంలో మూడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారని, నాలుగో ప్రయత్నంలో మేఘాలయాలో కిరాయి హంతకులతో చంపించారని పోలీసులు 790 పేజీల ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. హత్య జరిగిన తర్వాత సోనమ్ ఉత్తరప్రదేశ్‌కు పారిపోయి, అక్కడ పోలీసులకు పట్టుబడింది. అయితే, తాను దర్యాప్తుకు పూర్తిగా సహకరించానని, భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగిస్తానని సోనమ్ చెప్పింది. ఆమె ఇప్పటికే 10 నెలలు జైలులో గడపడంతో కోర్టు బెయిల్ ఇచ్చింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

స్కూళ్లలో డ్యాన్స్‌లపై కొత్త నిబంధనలు… కర్ణాటక కీలక నిర్ణయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha