Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగళూరు నుంచి మూడు గంటల్లోనే చెన్నైకి..

బెంగళూరు నుంచి మూడు గంటల్లోనే చెన్నైకి..

వార్త 1 week ago

Bengaluru to Chennai : బెంగళూరు వాసులు శుభవార్త.. త్వరలోనే చెన్నై- బెంగళూరు ఎక్స్ ప్రెస్ వే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎక్స్ ప్రెస్ వేను దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే బెంగళూరు-చెన్నైకి చాలా త్వరగా చేరుకోవచ్చు. సాధారణంగా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 6 నుంచి 7 గంటలు ఉంటుంది. అయితే ఈ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం పూర్తయితే కేవలం మూడు గంటల్లోనే బెంగళూరు నుంచి చెన్నైకి చేరుకోవచ్చు. ఈ ఎక్స్ ప్రెస్ వే మూడు రాష్ట్రాల మధ్య రవాణాకు కీలకం కానుంది.

Read Also: LPG Gas e-KYC: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ-కేవైసీ చేయించకుంటే సిలిండర్ సరఫరా బంద్!

 Bengaluru to Chennai

Bengaluru to Chennai : కర్ణాటకలోని హోస్‌కోట నుంచి తమిళనాడులోని పెరంబూర్ వరకు..

చెన్నై-బెంగళూరు మధ్య మొత్తం 258 కిలోమీటర్ల పొడవుతో కర్ణాటకలోని హోస్‌కోట నుంచి తమిళనాడులోని పెరంబూర్ వరకు ఈ జాతీయ ఎక్స్ ప్రెస్ వేను నిర్మిస్తున్నారు. ఈ రహదారి, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్-తమిళనాడులను అత్యంత వేగవంతమైన మార్గంతో అనుసంధానించనున్నారు. ఈ జాతీయ ద్వారా కర్ణాటకలోని హోస్‌కోట, మాలూరు, బంగారుపేట, బేతమంగళ, కోలార్, నరసాపుర ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు బెంగళూరు శాటిలైట్ టౌన్ రింగ్ రోడ్డుకు కలుపుతారు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె, పలమనేరు (మొగిలి) మీదుగా సుమారు 85 కిలోమీటర్ల మేర రహదారి అనుసంధానం చేయనున్నారు.

Epaper: epaper.vaartha.com

దుస్తుల్లో మూత్రం పోశాడని ఇంత దారుణమా..అసలు ఏమైందంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha