Bangalore Crime: బెంగళూరులోని కోతనూరు ప్రాంతంలో విషాదకరమైన సంఘటన వెలుగుచూసింది. తన భాగస్వామి విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, అదే అపార్ట్‌మెంట్ 17వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన భాను చంద్రారెడ్డి కుంట (32) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం అతను నివసిస్తున్న ఫ్లాట్‌లోని ఒక గదిలో తాళం వేసి ఉంది. ఎంత పిలిచినా లోపల నుంచి స్పందన రాకపోవడంతో, అతని భాగస్వామి షాజియా (31) ఆందోళనకు గురైంది. షాజియా ఐబీఎం (IBM) సంస్థలో ఉద్యోగిని. వెంటనే ఆమె అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బందిని, ఇరుగుపొరుగు వారిని సహాయం కోసం పిలిచింది.
Read Also : Kakatiya University Rat Attack: కేయూలో ఎలుకల దాడి.. 14 మందికి గాయాలు
Tragedy in Bengaluru.. Two techies die.
Bangalore Crime: కళ్లెదుటే మృతదేహం.. క్షణాల్లోనే షాజియా అఘాయిత్యం
అందరూ కలిసి గది తలుపులను బలవంతంగా పగులగొట్టి చూడగా, భాను చంద్రారెడ్డి లోపల ఉరివేసుకుని కనిపించాడు. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి శవమై కనిపించడంతో షాజియా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆ మానసిక క్షోభను తట్టుకోలేక, ఆమె గదిలో నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లి, అదే నివాస భవనంలోని 17వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మరణించింది.
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
మృతుల కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ పోలీసులు రెండు వేర్వేరు అసహజ మరణ కేసులను నమోదు చేశారు. వీరి మధ్య ఉన్న సంబంధాలు, ఆరోగ్య సమస్యలు లేదా పని ఒత్తిడి ఏదైనా ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరిద్దరూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదికలు వచ్చిన తర్వాత, వారి కాల్ డేటాను విశ్లేషించిన పిమ్మట ఈ ఆత్మహత్యలకు గల అసలైన కారణాలు స్పష్టమవుతాయని అధికారులు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

