మద్యం మత్తు, కుటుంబ తగాదాలతో హత్య కు దారి
Amangal crime: కుటుంబ తగాదాల కారణంగా విచక్షణ కోల్పోయిన ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్య, కన్న కొడుకును హత్య చేశాడు.
దాడిలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, తీవ్ర గాయాలతో కూతురు కొన ఊపిరితో ఆస్పత్రిలో తల్లడిల్లుతున్న విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే… ఆమనగల్లు మండలం సీతారాం నగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని పులిగోని పల్లి తండా కు చెందిన బాణావతి రాందాస్ నాయక్ కు భార్య కవిత తోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఒక మగ సంతానం ఉన్నారు. కుమారుడు హర్షిత్ (5) , ప్రణీత (10) మిగతా ఇద్దరు ఆడపిల్లలు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు
Read also: Nellore Crime: కొడవలూరులో జంట హత్యలు.. ప్రేమ వ్యవహారమే కారణమా..?

Amangal crime scene investigation news
Amangal crime: ప్రాణాపాయ స్థితిలో కూతురు
కాక మద్యానికి బానిసైన రామదాస్ తరచు భార్యతో గొడవపడేవారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి మద్యం మత్తులో మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది దీంతో మత్తులో ఉన్న రాందాస్ భార్య కవిత, కుమారుడు హర్షిత్ కూతురు ప్రణీతపై రోకలిబండ కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తుంది. దాడిలో కవిత, కుమారుడు హర్షిత్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూయాగ, తీవ్రంగా గాయపడిన ప్రణీత ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు షాద్నగర్ ఏసిపి ఆమనగల్లు ఎస్ హెచ్ ఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాందాస్ పోలీస్ అదుపులో ఉన్నారు. కాగా కర్కషత్వంతో భార్య పిల్లలను చంపిన ఘటన మానవత్వానికి మరక గా ప్రజలు అభివర్ణిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
14 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ప్రసవంతో బయటపడ్డ నిజం

