Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

వార్త 2 weeks ago

Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ జట్టులో కొత్త శకం ప్రారంభమైంది. సీనియర్ ఓపెనర్ స్మృతి మంధానను భారత మహిళల క్రికెట్ జట్టు నూతన కెప్టెన్‌గా బీసీసీఐ మంగళవారం నియమించింది.

ఇప్పటివరకు సుదీర్ఘకాలం కెప్టెన్‌గా వ్యవహరించిన హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో 29 ఏళ్ల మంధాన మొత్తం మూడు ఫార్మాట్లలో జట్టు బాధ్యతలను స్వీకరించనుంది. మంధాన జింబాబ్వేతో టీ20 సిరీస్ నుంచి కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

IND vs WI 1st T20: వెస్టిండీస్‌తో తొలి టీ20.. టీమిండియాలోకి కొత్త ప్లేయర్‌

హర్మన్‌ప్రీత్ వీడ్కోలు

భారత జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం ఉదయం హర్మన్‌ప్రీత్ కౌర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతకుముందు సోమవారం గౌహతిలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, హెడ్ కోచ్ అమోల్ ముజుందార్, స్మృతి మంధాన మరియు హర్మన్‌ప్రీత్‌ల మధ్య జరిగిన కీలక రివ్యూ సమావేశం అనంతరం ఈ మార్పు చోటుచేసుకుంది. 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్మృతి మంధానకు ఇప్పటివరకు 18 టీ20లు, 4 వన్డేల్లో భారత జట్టును నడిపించిన అనుభవం ఉంది.

డబ్ల్యూపీఎల్‌లో డబుల్ ఛాంపియన్ కెప్టెన్

ఫ్రాంచైజ్ క్రికెట్‌లో స్మృతి మంధానకు కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డు ఉంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును 2024, 2026 సీజన్లలో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టి తన నాయకత్వ పటిమను చాటుకుంది. ఆ అనుభవమే ఇప్పుడు ఆమెను జాతీయ జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌ను చేసింది.

నాయకత్వ బాధ్యతపై మంధాన స్పందన

భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడంపై స్మృతి మంధాన హర్షం వ్యక్తం చేససింది. “భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ నాకు ఎంతో గర్వకారణం. ఇప్పుడు జట్టును ముందుండి నడిపించే బాధ్యత లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన బీసీసీఐ, సెలక్టర్లు, సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు” అని ఆమె తెలిపింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. భువీ రీఎంట్రీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha