Dailyhunt
భారత సైన్యానికి అదానీ డిఫెన్స్ 'ప్రహార్' మెషిన్ గన్‌లు

భారత సైన్యానికి అదానీ డిఫెన్స్ 'ప్రహార్' మెషిన్ గన్‌లు

వార్త 3 weeks ago

Adani Prahaar LMG: భారత రక్షణ రంగ తయారీలో ప్రైవేట్ భాగస్వామ్యం సరికొత్త పుంతలు తొక్కుతోంది. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, భారత సైన్యం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 2,000 ప్రహార్ (Prahaar) 7.62 mm తేలికపాటి మెషిన్ గన్‌లను (LMG) విజయవంతంగా డెలివరీ చేసింది.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్లాంట్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also:Terrorism Index 2026: ఉగ్రవాదంలో నంబర్ 1 దేశంగా పాకిస్థాన్

Adani Prahaar LMG: రికార్డు సమయంలో ఉత్పత్తి

సాధారణంగా ఇటువంటి అత్యాధునిక ఆయుధాల ప్రొడక్షన్ మోడల్ అభివృద్ధికి 18 నెలల సమయం పడుతుంది. కానీ, అదానీ డిఫెన్స్ కేవలం 6 నెలల్లోనే ప్రొడక్షన్ మోడల్‌ను పూర్తి చేసింది.బల్క్ ప్రొడక్షన్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత, నిర్దేశించిన గడువు కంటే ముందే, అంటే 7 నెలల్లోనే మొదటి బ్యాచ్‌ను అందజేసింది.ఇది ప్రైవేట్ రంగంలో ఆయుధాల తయారీ, సరఫరాలో అత్యంత వేగవంతమైన పురోగతిగా నిలిచింది.

 Adani Defense Prahaar LMG

గ్వాలియర్ ప్లాంట్ విశేషాలు

ఈ ఆయుధాలను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న అదానీ చిన్న ఆయుధాల తయారీ కేంద్రంలో (Small Arms Manufacturing Facility) స్వదేశీ సాంకేతికతతో తయారు చేశారు. భారత సైన్యానికి ఎల్‌ఎమ్‌జీలను సరఫరా చేసిన మొదటి పెద్ద ప్రైవేట్ సంస్థగా అదానీ డిఫెన్స్ గుర్తింపు పొందింది. 100ఎకరాల విస్తీర్ణంలో గల ఈ కేంద్రం CNC మెషీనింగ్, రోబోటిక్స్, ప్రెసిషన్ మెట్రాలజీ, మెటలర్జీ ల్యాబ్‌లు, భూగర్భ ఫైరింగ్ రేంజ్ వంటి అధునాతన సాంకేతికతలతో నిర్మించారు.

చిన్న ఆయుధాల ఉత్పత్తికి ఇది దేశంలోనే తొలి పూర్తిగా సమీకృత ప్రైవేట్ రంగ హబ్‌గా నిలిచింది.ప్రహార్ LMG ఆధునిక యుద్ధభూమి అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. అధిక ఖచ్చితత్వం, విశ్వసనీయత, మన్నిక దీని లక్షణాలు. సెమీ-ఆటోమేటిక్, ఆటోమేటిక్ మోడ్‌లను కలిగి ఉండి, ప్రతికూల పరిస్థితుల్లోనూ సమర్థంగా పని చేస్తుంది. సైన్యంలోకి చేర్చడానికి ముందు కఠినమైన పరీక్షలు (లైఫ్‌సైకిల్, బాలిస్టిక్, పర్యావరణ) నిర్వహిస్తారు. గ్వాలియర్ ప్లాంట్‌కు సంవత్సరానికి లక్ష ఆయుధాలు తయారు చేయగల సామర్థ్యం ఉంది. 90 శాతానికి పైగా భాగాలు దేశీయంగానే సేకరిస్తున్నారు. ఈ చొరవ ఉద్యోగ కల్పనతో పాటు, రక్షణ సరఫరా గొలుసులోని MSME లకు మద్దతునిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఐస్‌క్రీమ్ గొడవ ప్రాణం తీసింది..అసలేం జరిగింది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha