Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉగ్రవాదంలో నంబర్ 1 దేశంగా పాకిస్థాన్

ఉగ్రవాదంలో నంబర్ 1 దేశంగా పాకిస్థాన్

వార్త 3 months ago

Terrorism Index 2026: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంఘటనలు తగ్గుముఖం పడుతున్నాయని గణాంకాలు చెబుతుంటే, పాకిస్థాన్ మాత్రం అందుకు భిన్నంగా హింసలో కూరుకుపోతోంది.

తాజాగా విడుదలైన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (GTI) 2026 నివేదిక ప్రకారం, ఉగ్రవాదం వల్ల ప్రపంచంలోనే అత్యధికంగా ప్రభావితమైన దేశంగా పాకిస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది.

Read Also:Tamil Nadu Elections 2026 : తమిళనాడు ఎన్నికల నగారా.. 164 స్థానాల్లో డీఎంకే పోటీ

 Global Terrorism Index 2026 Pakistan

2025: దశాబ్ద కాలంలోనే అత్యంత హింసాత్మక ఏడాది

గ్రీక్ సిటీ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2013 తర్వాత పాకిస్థాన్ చరిత్రలో 2025 అత్యంత రక్తసిక్తమైన సంవత్సరంగా నమోదైంది. నివేదికలోని కీలక గణాంకాలు ఇవే:

  • ఉగ్రదాడుల సంఖ్య: 1,045 దాడులు
  • మరణాలు: 1,139 మంది ప్రాణాలు కోల్పోయారు
  • గాయపడిన వారు: 1,595 మంది
  • బందీలు: 655 మందిని ఉగ్రవాదులు అపహరించారు
  • GTI స్కోరు: 10కి గాను 8.574 స్కోరుతో పాక్ అగ్రస్థానంలో ఉంది.

Terrorism Index 2026: అస్థిరతకు నిలయాలుగా రెండు ప్రావిన్సులు

ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సులలోనే 2025లో మొత్తం దాడుల్లో 74 శాతం, మరణాల్లో 67 శాతం నమోదయ్యాయి. ఈ ప్రాంతాలు నిరంతర అస్థిరత, బలహీనమైన ప్రభుత్వ నియంత్రణతో ఉగ్ర కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయని నివేదిక తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు వెంబడి దశాబ్దాలుగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉదాసీన వైఖరే ఇందుకు కారణమని విశ్లేషించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సౌదీ యువరాజుతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha