Mirzapur The Movie: డిజిటల్ స్క్రీన్‌పై సరికొత్త రికార్డులు సృష్టించి, ఓటీటీ (OTT) ప్రపంచాన్ని ఊపేసిన మోస్ట్ పాపులర్ సిరీస్ 'మిర్జాపూర్' ఇప్పుడు వెండితెరపై రచ్చ లేపేందుకు సిద్ధమైంది.
ఈ క్రేజీ సిరీస్ ఇప్పుడు ‘మిర్జాపూర్: ది మూవీ’ పేరుతో భారీ ఫీచర్ ఫిల్మ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Read Also : Director Nandini Reddy:మా ఇంటి బంగారం విజయం.. నందిని రెడ్డిపై ప్రశంసలు
‘Mirzapur: The Movie’ to release in theaters on September 4!
Mirzapur The Movie: క్యారెక్టర్ పోస్టర్లతో పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్!
సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు చిత్ర యూనిట్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. మిర్జాపూర్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్యారెక్టర్లయిన కాలీన్ భయ్యా, మున్నా భయ్యా, గుడ్డు భయ్యా ల పవర్‌ఫుల్ లుక్స్‌తో కూడిన ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లను విడుదల చేసింది. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఈ సినిమా పూర్తిగా అపరిమితమైన అధికారం, కుటుంబ వారసత్వం, ముఠా ముఠాల మధ్య సాగే దారుణమైన రక్తపాతం నేపథ్యంలో సాగనుందని మేకర్స్ స్పష్టం చేశారు.
హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్.. రేపే టీజర్!
ఈ బిగ్ స్క్రీన్ అడ్వెంచర్‌కు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, పునీత్ కృష్ణ పవర్‌ఫుల్ కథను అందించారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ప్రముఖ నిర్మాతలు రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా దీనిని హిందీతో పాటు తెలుగు భాషల్లోనూ భారీగా విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన మోస్ట్ అవేటెడ్ టీజర్ రేపు (గురువారం) విడుదల కానుంది.

