Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"భారత్‌తో యుద్ధాన్ని కోల్‌కతా వరకు తీసుకెళ్తాం"! ఖవాజా ఆసిఫ్

"భారత్‌తో యుద్ధాన్ని కోల్‌కతా వరకు తీసుకెళ్తాం"! ఖవాజా ఆసిఫ్

వార్త 2 months ago

Khawaja Asif: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌ను ఉద్దేశించి చేసిన "కోల్‌కతా" వ్యాఖ్యలు ఇప్పుడు రెండు దేశాల మధ్య తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

తన దేశం ఎదుర్కొంటున్న భారీ ఆర్థిక సంక్షోభం, ఆకాశాన్నంటుతున్న గ్యాస్, ఇంధన ధరల (లీటర్ పెట్రోల్ సుమారు ₹458 మార్కుకు చేరినట్లు నివేదికలు ఉన్నాయి) నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆయన ఈ తరహా యుద్ధ ప్రాతిపదికన వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: Indian Ocean Earthquake: హిందూ మహాసముద్రంలో భూకంపం!

తాజాగా సియాల్‌కోట్‌లో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. భారత్ తమ దేశంపై తప్పుడు కారణాలతో దాడి చేయడం ఆపరేషన్లకు ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. ఒకవేళ ఈసారి భారత్ అటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే, తాము ఊరుకోమని, యుద్ధ రంగం కేవలం సరిహద్దులకే పరిమితం కాదని, అది కోల్‌కతా వరకు విస్తరిస్తుందని చెప్పారు..

Khawaja Asif: ఆపరేషన్ సిందూర్

ఖవాజా ఆసిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన మునుపటి హెచ్చరికలకు ప్రతిస్పందనగా భావిస్తున్నారు. పొరుగు దేశం ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా, మునుపెన్నడూ లేనివిధంగా నిర్ణయాత్మకమైన జవాబు ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ గతంలో పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

వాషింగ్టన్ మేయర్ రేసులో భారత సంతతి మహిళ.. ఎవరీ రిని సంపత్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha