Tobacco prices : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొగాకు (Tobacco) సాగు చేసిన రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మార్కెట్‌లో పొగాకు ధరలు ఒక్కసారిగా భారీగా పతనమవడంతో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతాంగం కన్నీరుమున్నీరవుతోంది.
అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉండే నాణ్యమైన వర్జీనియా రకం (Virginia Tobacco) పొగాకు ధర గతంలో కేజీ రూ. 350 నుంచి రూ. 450 వరకు పలకగా.. ప్రస్తుతం అది ఏకంగా రూ. 200కు పడిపోయింది. అంటే దాదాపు సగానికి పైగా ధర తగ్గడంతో రైతులకు కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏడాది పొడవునా రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటకు మార్కెట్‌లో కనీస గిట్టుబాటు ధర దక్కకపోవడంతో వేలాది మంది పొగాకు రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయారు.
Read Also ; కూటమి రెండేళ్ల పాలన విఫలం..మద్యం దోపిడీ!

Tobacco prices: కొనుగోలు కేంద్రాల్లో కోతలు.. రంగంలోకి దిగిన మంత్రి అచ్చెన్నాయుడు!
ధరల పతనానికి తోడు కొనుగోలు కేంద్రాల్లో బోర్డుల నిబంధనలు, వ్యాపారుల సిండికేట్ రైతులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. మార్కెట్ యార్డులకు రైతులు తెస్తున్న మొత్తం పంటను అధికారులు, వ్యాపారులు కొనుగోలు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు దాదాపు 100 పొగాకు బేళ్లను (Tobacco Bales) విక్రయానికి తెస్తే.. అందులో కేవలం 10 బేళ్లను మాత్రమే గ్రేడింగ్ సాకుతో తీసుకుంటూ మిగిలిన పంటను తిరస్కరిస్తున్నారు. ఈ తీవ్రమైన సమస్యపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పొగాకు బోర్డు పరిధిలోని అన్ని రకాల గ్రేడ్ల పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, వ్యాపారులతో మాట్లాడి కొనుగోళ్లు వేగవంతం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

