Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూటమి రెండేళ్ల పాలన విఫలం..మద్యం దోపిడీ!

కూటమి రెండేళ్ల పాలన విఫలం..మద్యం దోపిడీ!

వార్త 4 days ago

YSRCP Talari Rangaiah: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినప్పటికీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మంగళవారం కళ్యాణదుర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కూటమి రెండేళ్ల పాలనపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు.

Read Also: Botsa Satyanarayana: స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్లే ప్రమాదాలు.. బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు!

మద్యం రూపంలో పేదవాడి రక్తం తాగుతున్నారు..

బెల్ట్ షాపుల బెల్ట్ తీస్తానని సీఎం నారా చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేస్తే.. కళ్యాణదుర్గంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందని తలారి రంగయ్య మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రతి మద్యం బాటిల్‌పైన రూ.30 నుండి రూ.60 దాకా అదనంగా వసూలు చేస్తూ పేదవాడి కష్టాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.

“ఇలా అక్రమంగా వసూలైన నిధులన్నీ స్థానిక ఎమ్మెల్యే జేబులోకే వెళుతున్నాయి. ఆ దోపిడీ సొమ్ముతోనే గుడులకు, గోపురాలకు విరాళాలు ఇస్తూ.. అవి తన సొంత నిధులన్నట్టు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు.” - డా. తలారి రంగయ్య, వైఎస్సార్సీపీ సమన్వయకర్త.

 YSRCP Talari Rangaiah Fire On Alliance Govt

YSRCP Talari Rangaiah: హామీల అమలు ఎక్కడ? మెగా డీఎస్సీపై స్పష్టత లేదు!

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు కులమతాలకు అతీతంగా ప్రతి ఇంటికీ చేరాయని, ప్రస్తుత పాలనలో ఆ స్థాయి సంక్షేమం ఎక్కడా కనిపించడం లేదని రంగయ్య విమర్శించారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (Mega DSC) సహా పలు కీలక అంశాలపై ప్రతిపక్షంగా తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందన్నారు. రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నా, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు.

వైఎస్సార్సీపీ ప్రధాన డిమాండ్లు:

  • మద్యం నియంత్రణ: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బెల్ట్ షాపులను అరికట్టి, మద్యం అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
  • వైద్యం, విద్య: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలి.
  • పారదర్శకత: ప్రజాస్వామ్యంలో విమర్శలను సానుకూలంగా స్వీకరించి, ప్రభుత్వం తన పనితీరును ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలి.

రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

విద్య సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలి.. గవర్నర్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha