Wanaparthy Crime: వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండల పరిధిలోని సాల్కలాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి అత్యంత దారుణమైన విషాదం చోటు చేసుకుంది. దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు శవాలుగా మారడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. డోకూరు గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి సాల్కలాపూర్ పరిధిలో ఒక మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తోటను సంరక్షించుకుంటూ తన కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు.
Read also:Gujarat Crime:రూ.50 వేల కోసం భార్యను స్నేహితులకు అమ్మేసిన భర్త!
Man Kills Wife and Two Children Before Hanging Himself in Mango Orchard
బుధవారం రాత్రి తోటలో ఏం జరిగిందో తెలియదు కానీ, నరసింహ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ముందుగా తన భార్య హేమలతను గొంతుకు ఉరివేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన ఇద్దరు అమాయక పిల్లలైన సాయి నిహాల్, సాయిశ్రీలను అక్కడే ఉన్న నీళ్ల సంపు (Water Sump) లో పడేసి నీటముంచి హతమార్చాడు. భార్య, పిల్లలు ముగ్గురి ప్రాణాలు తీసిన తర్వాత.. నరసింహ తోటలోని ఒక చెట్టుకు ఉరేసుకుని తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం తోట వద్దకు వచ్చిన స్థానికులు ఈ ఘోర దృశ్యాన్ని గమనించి దిగ్భ్రాంతికి గురయ్యారు.
Wanaparthy Crime:కారణం అప్పుల బాధేనా?.. దర్యాప్తులో పోలీసులు
ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. నరసింహ మామిడి తోట కౌలు, ఇతర కుటుంబ అవసరాల నిమిత్తం చేసిన అప్పుల బాధ తట్టుకోలేకనే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని గ్రామస్తులు బలంగా అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడటంతో డోకూరు, సాల్కలాపూర్ గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

