Dailyhunt
భార్య జంప్.. పోలీస్ స్టేషన్ ఎదుట భర్త ఆత్మహత్యాయత్నం!

భార్య జంప్.. పోలీస్ స్టేషన్ ఎదుట భర్త ఆత్మహత్యాయత్నం!

వార్త 2 weeks ago

Veeravalli Crime: కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో చోటుచేసుకున్న ఒక కుటుంబ కలహం పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, మరొకరితో వెళ్ళిపోయిందన్న బాధతో ఓ భర్త బలవన్మరణానికి యత్నించడం స్థానికంగా కలకలం రేపింది.

Read Also: Hindupuram crime: టెన్త్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య!

ప్రేమ వివాహం.. మనస్పర్థలు.. చివరకు ప్రియుడితో పరారీ

బాపులపాడు మండలానికి చెందిన బాధితుడు, సుమారు ఆరు సంవత్సరాల క్రితం ఒక మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్ల పాటు సాఫీగానే సాగిన వీరి సంసారంలో ఇటీవల మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సదరు మహిళ తన పాత ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ప్రాణంగా ప్రేమించిన భార్య ఇలా మరొకరితో వెళ్ళిపోవడాన్ని భర్త తట్టుకోలేకపోయాడు.

Veeravalli Crime: వీరవల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం

ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వీరవల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన భర్త, అక్కడే తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. క్షణికావేశంలో తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో పోలీస్ స్టేషన్ ఎదుటే గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని గమనించిన స్థానికులు మరియు పోలీసులు వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha