Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భార్య వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య!

భార్య వివాహేతర సంబంధం.. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య!

వార్త 1 month ago

Bengaluru crime: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు రూరల్ జిల్లాలో మనసును కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, అవమాన భారంతో ఒక నిండు సంసారం చిన్నాభిన్నమైంది.

Read Also :Srikakulam: కాశీబుగ్గ జువెలరీ షాప్ లో జరిగిన డెకాయిటీ గ్యాంగ్ అరెస్టు

ఘటన వివరాలు: ఆల్కెరె గ్రామంలో విషాదం

బెంగుళూరు రూరల్ జిల్లా ఆల్కెరె గ్రామానికి చెందిన శివణ్ణ (40), కావ్య (36) దంపతులకు జీవన్ (10), ప్రాణేశ్ (6) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, కావ్య వారం రోజుల క్రితం శివణ్ణ అక్క కుమారుడైన హేమంత్‌తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. పెద్దలు రాజీ కుదిర్చి ఆమెను తిరిగి ఇంటికి పంపించినప్పటికీ, మూడు రోజుల క్రితం ఇంట్లోని నగదు, నగలతో ఆమె మళ్ళీ కనిపించకుండా పోయింది.

Bengaluru crime: కుంగిపోయిన భర్త.. దారుణ నిర్ణయం

భార్య ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన శివణ్ణ, శుక్రవారం రాత్రి తన ఇద్దరు చిన్నారులను అతి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బీభత్సం సృష్టించిన కారు.. బానెట్‌పై వ్యక్తిని 2 కిమీ ఈడ్చుకెళ్లిన డ్రైవర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha