Dailyhunt
బీభత్సం సృష్టించిన కారు.. బానెట్‌పై వ్యక్తిని 2 కిమీ ఈడ్చుకెళ్లిన డ్రైవర్

బీభత్సం సృష్టించిన కారు.. బానెట్‌పై వ్యక్తిని 2 కిమీ ఈడ్చుకెళ్లిన డ్రైవర్

వార్త 6 days ago

Hyderabad Road Accident: హైదరాబాద్‌లోని గాయత్రి నగర్ నుండి ఎల్బీనగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఎస్‌కే జిలానీ, అతని కుమారుడు ఫైసల్‌ను ఒక కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్‌ను జిలానీ ప్రశ్నించగా, ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కారులో ఉన్న వ్యక్తి జిలానీపై దాడి చేసి, అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.

Read Also:Srikakulam: కాశీబుగ్గ జువెలరీ షాప్ లో జరిగిన డెకాయిటీ గ్యాంగ్ అరెస్టు

Hyderabad Road Accident: బానెట్‌పై ప్రాణసంకటం.. 2 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్తూ

డ్రైవర్ పారిపోకుండా ఉండేందుకు జిలానీ కారుకు అడ్డుగా నిలబడ్డారు. అయితే, డ్రైవర్ ఏమాత్రం కనికరం లేకుండా కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. దీంతో జిలానీ కారు బానెట్‌పై పడిపోయారు. బాధితుడు బానెట్‌పైనే ఉండగానే, డ్రైవర్ కారును ఆపకుండా సుమారు రెండు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. బాలాపూర్ చౌరస్తా వరకు వెళ్లిన కారు, మళ్లీ వెనక్కి తిరిగి మందమల్లమ్మ చౌరస్తాకు చేరుకుంది.

బానెట్‌పై వ్యక్తిని ఈడ్చుకెళ్లడం గమనించిన ప్రయాణికులు, స్థానికులు మందమల్లమ్మ చౌరస్తా వద్ద కారును చుట్టుముట్టారు. దీంతో చేసేది లేక డ్రైవర్ బాధితుడిని అక్కడ వదిలేసి, కారుతో సహా పరారయ్యాడు. ఈ ప్రమాదంలో జిలానీ కుమారుడు ఫైసల్ తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం అతను ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఇరాన్‌లో ఇద్దరు మొసాద్ ఏజెంట్లకు ఉరిశిక్ష!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha