Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భార్యాభర్తల మధ్య తరుచు గొడవలపై DGP ఆనంద్ కీలక వ్యాఖ్యలు

భార్యాభర్తల మధ్య తరుచు గొడవలపై DGP ఆనంద్ కీలక వ్యాఖ్యలు

వార్త 2 months ago

Husband & Wife Clash : చిన్నపాటి మనస్పర్థలు మరియు అనవసరమైన ఆవేశాల కారణంగా భార్యాభర్తల పవిత్ర బంధం విచ్ఛిన్నం కావడంపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

మల్కాజిగిరి జిల్లా పోలీసులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'కలిసి ఉంటే కలదు సుఖం' అనే కౌన్సెలింగ్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భార్యాభర్తల మధ్య వస్తున్న సమస్యలు చాలా సులభంగా విడిపోయే (విడాకులు) స్థాయికి చేరుకుంటున్నాయని, ఫలితంగా వేలాది కేసులు పోలీస్ స్టేషన్లకు వస్తున్నాయని పేర్కొన్నారు. దంపతులు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని, అనవసర కోపతాపాలకు పోకుండా కలిసిమెలిసి జీవించినప్పుడే కుటుంబ వ్యవస్థ నిలబడుతుందని ఆయన హితవు పలికారు.

Read Also : జులైలో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికలు!

ఆవేశాన్ని తగ్గించే సింపుల్ సూత్రం.. పోలీసుల వినూత్న ప్రయత్నం

కుటుంబాలలో కలహాలు రేగినప్పుడు వాటిని ఎలా అధిగమించాలో డీజీపీ ఒక ప్రాక్టికల్ సూత్రాన్ని దంపతులకు వివరించారు. దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు ఇద్దరూ ఆవేశంతో అరుచుకోవడం వల్ల సమస్య మరింత జటిలమవుతుందని, అలాంటప్పుడు ఒకరు కాసేపు మౌనంగా ఉండి (నోరు మూసుకుని) ఇంటి బయటకు వెళ్లడం ఉత్తమమని సూచించారు. కాసేపటి తర్వాత కోపం తగ్గినప్పుడు పంతాలు సమసిపోయి, సమస్యలు సామరస్యంగా పరిష్కారమవుతాయని ఆయన స్పష్టం చేశారు. కేవలం చట్టాలను అమలు చేయడమే కాకుండా, విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలను కౌన్సెలింగ్ ద్వారా తిరిగి ఒకటి చేసేందుకు మల్కాజిగిరి పోలీసులు చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నాన్ని డీజీపీ ఈ సందర్భంగా అభినందించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బిఆర్ఎస్ నేతలు అష్టదరిద్రులు అంటూ సీఎం రేవంత్ విమర్శలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha