Dailyhunt
భార్యను చంపి..  కొడుకును అడవిలో వదిలేసిన కిరాతక తండ్రి

భార్యను చంపి.. కొడుకును అడవిలో వదిలేసిన కిరాతక తండ్రి

వార్త 4 days ago

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లోని రాయ్‌సేన్‌, విదిశ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానంతో కన్నతండ్రి అని కూడా చూడకుండా, రెండేళ్ల పసిబిడ్డను క్రూర మృగాలు తిరిగే దట్టమైన అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడు ఒక కిరాతకుడు.

పోలీసులు రాత్రంతా గాలింపు చేపట్టి ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడారు.

నమ్మించి తీసుకెళ్లి.. అంతమొందించి..

బేగంగంజ్‌లోని హిమోటియా గ్రామానికి చెందిన రాజేంద్ర అహిర్‌వార్, తన భార్య జ్యోతిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను వదిలించుకోవాలని పథకం వేశాడు. రెండు రోజుల క్రితం భార్యకు కొత్త మొబైల్ ఫోన్ కొనిస్తానని నమ్మబలికి, తన రెండేళ్ల కుమారుడితో సహా బయటకు తీసుకెళ్లాడు. వారిని హైదర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ భార్యతో గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయిన రాజేంద్ర, జ్యోతి తలపై బండరాయితో మోది అక్కడికక్కడే హత్య చేశాడు. అనంతరం భయంతో ఏడుస్తున్న తన కుమారుడిని కూడా అడవిలోనే వదిలేసి పారిపోయాడు.

Read Also : UP Crime: ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసిన దారుణం.. 14 ఏళ్ల బాలికపై మామయ్య, తండ్రి అత్యాచారం

 Husband brutally kills wife and abandons baby in forest!

Madhya Pradesh Crime: పోలీసుల విచారణలో వెలుగులోకి నిజం

జ్యోతి, ఆమె కుమారుడు రెండు రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాజేంద్రను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం బయటపడింది. తాను భార్యను చంపేశానని, బాబును అడవిలో వదిలేశానని అతడు చెప్పడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. చిమ్మచీకటి, క్రూరమృగాల సంచారం ఉండే ఆ అడవిలో చిన్నారి పరిస్థితి ఏంటోనని పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు.

చిన్నారి ప్రాణాలు సురక్షితం

సుమారు 12 పోలీస్ స్టేషన్ల సిబ్బందితో బృందాలు ఏర్పాటు చేసి, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్‌లు, శక్తివంతమైన టార్చి లైట్ల సహాయంతో రాత్రంతా అడవిని జల్లెడ పట్టారు. సుమారు 10 గంటల పాటు గాలింపు చర్యల తర్వాత, తెల్లవారుజామున ఒక పొద సమీపంలో చిన్నారి ఆచూకీ దొరికింది. ఆకలి, దప్పికతో అలమటిస్తూ, భయంతో వణికిపోతున్న బాలుడిని చూసి పోలీసులు చలించిపోయారు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాబు క్షేమంగా ఉన్నాడు. నిందితుడు రాజేంద్రపై హత్య, సాక్ష్యాలను దాచిపెట్టడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ప్రేమ వ్యవహారం.. మనస్పర్థలతో యువతీయువకుల ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha