Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రేమ వ్యవహారం.. మనస్పర్థలతో యువతీయువకుల ఆత్మహత్య

ప్రేమ వ్యవహారం.. మనస్పర్థలతో యువతీయువకుల ఆత్మహత్య

వార్త 1 month ago

Kadapa Crime: కడప జిల్లాలో ఒకేరోజు ప్రేమికుల జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చెన్నూరు మండలానికి చెందిన హేమశ్రీ, యోగేంద్ర కుమార్ వర్మ అనే యువతీ యువకులు ప్రాణాలు తీసుకున్న తీరు ఇరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం సాగుతోందని సమాచారం.

Read Also : AchampetaFire Accident: మన్ననూరులో అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన గుడిసె.!

 Couple commits suicide in separate places due to emotional differences

Kadapa Crime: కడపలో యువకుడు.. చెన్నూరులో యువతి..

వివరాల్లోకి వెళితే, యోగేంద్ర కుమార్ వర్మ కడప నగరంలోని తన బంధువుల నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో, యువతి హేమశ్రీ చెన్నూరులోని తన స్వగృహంలో ఉరివేసుకుని తనువు చాలించింది. అయితే, వీరిద్దరూ ఒకే సమయంలో, వేర్వేరు ప్రదేశాల్లో ఈ ఘాతుకానికి ఒడిగట్టడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మనస్పర్థలే కారణమా?

ప్రాథమిక సమాచారం ప్రకారం, వీరిద్దరి మధ్య ఇటీవల కొన్ని మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. గొడవ కారణంగానే తీవ్ర మనస్తాపానికి గురై ఇద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకరి ఆత్మహత్య వార్త విని మరొకరు ప్రాణాలు తీసుకున్నారా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వారి ఫోన్ డేటా ఆధారంగా చివరిగా వారు ఎవరితో మాట్లాడారు? ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలేమిటి? అనే అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసిన దారుణం.. 14 ఏళ్ల బాలికపై మామయ్య, తండ్రి అత్యాచారం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha