Jharkhand: ఝార్ఖండ్ రాష్ట్రం గిరిడీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పానీపూరీ తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్ కావడంతో ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
మరో 18 మంది తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Read Also: Tadipatri crime: తాడిపత్రిలో హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతి
అసలేం జరిగిందంటే?
Jharkhand: Six-year-old boy dies after eating panipuri.. 18 others fall ill!
ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బజ్టో గ్రామంలో శనివారం ఒక వ్యాపారి ఇంటింటికీ తిరిగి పానీపూరీ విక్రయించాడు. అది తిన్న గ్రామస్థులకు శనివారం రాత్రి నుంచే అనారోగ్య లక్షణాలు మొదలయ్యాయి. బాధితుల్లో తీవ్రమైన జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి. ఆదివారం ఉదయానికి పరిస్థితి విషమించడంతో వారందరినీ వెంటనే సదర్ ఆసుపత్రికి తరలించారు.
Jharkhand: చికిత్స పొందుతూ బాలుడి మరణం
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న 18 మంది పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యులు వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని సివిల్ సర్జన్ డాక్టర్ బచ్చా ప్రసాద్ సింగ్ తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్ వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.
పరారీలో వ్యాపారి.. విచారణకు ఆదేశం
ఘటన జరిగినప్పటి నుంచి పల్మో నివాసి అయిన పానీపూరీ వ్యాపారి పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు బాధితులను పరామర్శించి, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

