Dailyhunt
తాడిపత్రిలో హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతి

తాడిపత్రిలో హిజ్రా మల్లిక అనుమానాస్పద మృతి

వార్త 1 week ago

Tadipatri crime: అనంతపురం జిల్లా తాడిపత్రిలో హిజ్రా మల్లిక మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రైలు పట్టాలపై మల్లిక మృతదేహం లభ్యం కావడంతో, ఇది ముమ్మాటికీ హత్యేనని ఆమె అనుచరులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Assault on RTC Driver Nalgonda Rural: విధినిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి - నిందితుడిపై కేసు నమోదు

Tadipatri crime: సీసీటీవీలో కిడ్నాప్ దృశ్యాలు

పోలీసుల కథనం ప్రకారం.. తాడిపత్రికి చెందిన మల్లిక నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ కిడ్నాప్ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే, రాత్రి సమయంలో చల్లవారిపల్లి రైల్వే గేట్ సమీపంలో మల్లిక శవమై కనిపించింది.

ముగ్గురు అనుమానితుల అరెస్ట్

మల్లిక మరణానికి ప్రత్యర్థి గ్రూపు సభ్యులే కారణమని తోటి హిజ్రాలు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. శిరీష, సంగీత, రాధ అనే ముగ్గురు హిజ్రాలను అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు.

గ్రూపు తగాదాలే కారణమా?

హిజ్రా వర్గాల మధ్య గత కొంతకాలంగా ఉన్న గ్రూపు తగాదాలే ఈ హత్యకు దారితీశాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పక్కా పథకం ప్రకారమే కిడ్నాప్ చేసి రైలు పట్టాలపై పడేశారా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

భార్య చేతిలో భర్త హత్య.. అసలేం జరిగింది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha