Bhadrachalam Sri Rama Navami Celebrations: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రం శ్రీరామనవమి వేడుకలకు సర్వసిద్ధమైంది.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన వేడుక. గోదావరి నదీ తీరాన వెలసిన ఈ దివ్యధామం, సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది.ఈ దివ్యధామం, విద్యుత్ దీపాల అలంకరణలతో దేదీప్యమానంగా వెలుగుతోంది. స్వామివారి కళ్యాణ వేడుకలను కళ్లారా వీక్షించేందుకు భక్తులు దేశం నలుమూలల నుండి భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు, మాడ వీధులు జనసంద్రమయ్యాయి.
Read Also:Revanth Reddy: నేడు శ్రీ సీతారాముల కళ్యాణలో పాల్గొననున్న సీఎం రేవంత్ దంపతులు
Bhadrachalam Sri Rama Navami Celebrations: భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులు వేచి ఉండే క్యూలైన్ల పొడవునా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.మంచినీరు, మజ్జిగ పంపిణీతో పాటు వైద్య శిబిరాలను సిద్ధం చేశారు.తోపులాటలు జరగకుండా, వీఐపీ మరియు సామాన్య భక్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి పకడ్బందీ భద్రతను కల్పించారు.
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సుఖసంతోషాలతో విరాజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. భద్రాద్రి రామాలయ విశిష్టతను చాటిచెప్పేలా, ఆలయ సమగ్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం రూ. 351 కోట్లతో మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసిందని ఈ సందర్భంగా ప్రకటించారు. భక్తులకు కల్పించే వసతుల విషయంలో రాజీ పడకూడదని, అత్యుత్తమ ఏర్పాట్లతో వేడుకలను నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఆదర్శ పాలనకు శ్రీరాముడే స్ఫూర్తి - సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ, ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా నిలిచిన ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడు శ్రీరాముడు. ఆయన అవతరించిన రోజు, ఆయన కళ్యాణం జరిగిన రోజు మనం శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటాం. శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన. అలాంటి రామరాజ్యాన్ని స్థాపించుకోవడానికి మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. శ్రీరామచంద్రమూర్తి సుగుణాలతో ప్రతి ఒక్కరూ ఆదర్శ జీవితం గడపాలని, మీకు మీ కుటుంబానికి ఆ శ్రీరాముడి కృపాకటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

