Sangareddy: సంగారెడ్డి జిల్లా చౌట్కూరు మండల కేంద్రంలోని రైతు నివేదిక కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నామాల కిష్టయ్య, స్థానిక మాజీ ఎంపీపీ బూమ్‌రెడ్డి సుభాష్‌రెడ్డి, సర్పంచ్ పార్కల రామ్‌రెడ్డి, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రామాగౌడ్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
Read Also: Bandi Bhagirath case: బండి భగీరథ్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్
Congress Government Stands by Needy Families: Subhash Reddy
Sangareddy: చెక్కుల పంపిణీ వివరాలు
మొత్తం 55 కళ్యాణ లక్ష్మి, 2 షాదీ ముబారక్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తోందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటు పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో అనుదీప్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు వరకల రమేష్ వార్డ్ మెంబర్లు చక్రపాణి గోరేమియా కాంగ్రెస్ నాయకులు కొలుకూరి మొగులయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

