Bandi Bhagirath: తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన పోక్సో (POCSO) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు ఆదేశాల మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు ఈరోజు ఉదయం భగీరథ్‌ను చర్లపల్లి కేంద్ర కారాగారం నుండి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ కేసులో లోతైన విచారణ జరిపి, మరిన్ని కీలక వివరాలు సేకరించేందుకు పోలీసులకు న్యాయస్థానం మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది.
bandi bhagirath pocso case
read also: Hydra seizes lands in Kokapet: కోకాపేటలో హైడ్రా రూ. 4,117 కోట్ల విలువైన భూములు స్వాధీనం
Bandi Bhagirath: వైద్య పరీక్షల అనంతరం డీసీపీ పర్యవేక్షణలో విచారణ
కోర్టు ఉత్తర్వుల ప్రకారం, జైలు నుండి తీసుకున్న వెంటనే ప్రభుత్వ నిబంధనల మేరకు బండి భగీరథ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం భారీ భద్రతా వలయం మధ్య ఆయన్ను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కూకట్‌పల్లి డీసీపీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ విచారణ ప్రక్రియ కొనసాగుతోంది.
బాధితురాలి నుంచి సేకరించిన తాజా స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు ఈ కేసులో అదనపు సెక్షన్లను చేర్చారు. ఈ నేపథ్యంలో, రాబోయే మూడు రోజుల పోలీస్ కస్టడీ విచారణ ఈ కేసులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

