Kalyanadurgam news: కళ్యాణదుర్గం నియోజకవర్గ రైతుల సాగునీటి కలలను నెరవేర్చేందుకు భైరవాణి తిప్ప ప్రాజెక్టు ద్వారా 114 చెరువులకు సాగునీరు అందించే ఎన్నికల హామీ పథకం పూర్తి చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసేందుకు కృషి జరుగుతోందని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి సాగునీటి పథకాలపై క్యాలెండర్ ప్రకటించి అందులో 2028 లోపు భైరవానికి ప్రాజెక్టును పూర్తి చేయునట్లు ప్రకటించారని తెలిపారు. బి టి పి సాగునీటిని రైతులకు అందించాక ప్రతి ఇంట్లో చంద్రబాబు నాయుడు ఫోటో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Read also: Bhupathiraju Srinivasa Varma: ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి వర్మ కీలక పర్యటన
Completion of Bhairavani Thippa Project Works
Kalyanadurgam news: మహానాడు వేడుకల్లో పార్టీ శ్రేణుల ఉత్సాహం
కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో సంక్షేమానికి కూడా పెద్దపీట వేశామన్నారు. మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతిలో పండుగలా జరుపుకుంటున్నామని తెలిపారు. గత రాత్రి వర్షం బీభత్సం సృష్టించినా, ఏర్పాట్లు చేసుకుని పటిష్టమైన పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు రామకృష్ణ తెలుగు యువత నాయకులు అనిల్ కుమార్ పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
టీడీపీ మహానాడు 2026: పార్టీలో మహిళలకు 33 శాతం సీట్లు.. మంత్రి లోకేశ్

