Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి వర్మ కీలక పర్యటన

ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి వర్మ కీలక పర్యటన

వార్త 2 weeks ago

Bhupathiraju Srinivasa Varma: ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ బుధవారం నుండి మూడు రోజుల పాటు అసోం, మేఘాలయ రాష్ట్రాలల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షలు మేరకు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి శాఖ సమన్వయంతో ఈ కీలక పర్యటన సాగనుంది. మంగళవారం సాయంత్రం గువహతికి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ చేరుకున్నారు. బిజెపి నాయకత్వంలో నూతనంగా కొలువుదీరిన ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మతో పాటు ఇతర కీలక నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈశాన్య ప్రాంతంలో పారిశ్రామిక, మౌలిక వసతుల కల్పనను మరింత వేగంతం చేయడంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు.

 Development of the Northeastern States

Read also: TDP Mahanadu: సరికొత్త డిజిటల్ హంగులతో 'మహానాడు 2026' షురూ.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!

Bhupathiraju Srinivasa Varma: అసోం పర్యటనలో ఉన్నత స్థాయి సమీక్ష

అసోం పర్యటన అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మేఘాలయ రాష్ట్రంలో రెండు రోజుల పాటు అధికారికంగా పర్యటిస్తారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిద ప్రజా సంక్షేమ, మౌలిక వసతుల పథకాల అమలుతీరు ఆయన నేరుగా పర్యవేక్షిస్తారు. ఇందులో భాగంగా మేఘాలయలోని సుదూర ప్రాంతమైన సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలో కేంద్ర మంత్రి క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ అంత్యోదయ స్ఫూర్తితో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మక్షేత్రస్థాయి పర్యటన సాగుతోందని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు ఈశాన్య రాష్ట్రాలలోని ప్రతి పౌరుడికి క్షేత్రస్థాయిలో అందుతున్నాయా లేదా అని సమీక్షించడంతో పాటు అక్కడ ప్రగతి చక్రం మరింత వేగవంతం అయ్యేలా అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha