Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీడీపీ మహానాడు 2026: పార్టీలో మహిళలకు 33 శాతం సీట్లు.. మంత్రి లోకేశ్

టీడీపీ మహానాడు 2026: పార్టీలో మహిళలకు 33 శాతం సీట్లు.. మంత్రి లోకేశ్

వార్త 2 weeks ago

TDP Mahanadu 2026: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతిష్టాత్మక వార్షిక పండుగ 'మహానాడు-2026' అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది.

ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా ‘హైబ్రిడ్ విధానం’లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నప్పటికీ, పార్టీ కేడర్‌లో మాత్రం పసుపు పండగ జోష్ స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీకి పెట్టని కోటగా ఉన్న మహిళలకు, రేపటి భవిష్యత్తు అయిన యువతకు ఈ మహానాడులో అగ్రతాంబూలం ఇచ్చారు. మహానాడు వేదికగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మహిళలకు 33 శాతం సీట్లను కేటాయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Read Also: Bhupathiraju Srinivasa Varma: ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి వర్మ కీలక పర్యటన

 TDP Mahanadu 2026

  • బిల్లుతో సంబంధం లేకుండా: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా సరే.. తమ పార్టీ తరపున కచ్చితంగా 33 శాతం సీట్లను మహిళలకే కేటాయిస్తామని లోకేశ్ ప్రకటించారు.
  • సోషల్ మీడియా వేదికగా: ఈ ఉదయమే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ‘బిగ్ అనౌన్స్‌మెంట్‌’ రాబోతోందని మంత్రి లోకేశ్ పోస్ట్ పెట్టారు. దానికి తగ్గట్టుగానే మహానాడు వేదికపై మహిళా సాధికారతకు అద్దం పట్టేలా ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

TDP Mahanadu 2026: హైబ్రిడ్ విధానంలో మహానాడు.. లక్షలాదిగా తరలివచ్చిన శ్రేణులు

“పసుపు జెండా – పేదవానికి అండ, ప్రగతికి అజెండా” అనే నినాదంతో ఈ రెండ్రోజుల మహానాడు షెడ్యూల్‌ను రూపొందించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,875 క్లస్టర్ల నుంచి లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఈ మహా వేడుకలో భాగస్వాములయ్యేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ మహానాడు వేదికగా మొత్తం 20 కీలక రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పార్టీ బలోపేతం మరియు భవిష్యత్తు వ్యూహాలపై నేతలు కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha