Dailyhunt
భక్తి పారవశ్యంలో గౌడ కులదేవతల మహోత్సవం

భక్తి పారవశ్యంలో గౌడ కులదేవతల మహోత్సవం

వార్త 1 week ago

ఆధ్యాత్మిక వైభవంగా విగ్రహ స్థిర ప్రతిష్ఠ, కళ్యాణ మహోత్సవం

పాల్గొన్న రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్

Madgul Village Festivals: శ్రీ కంఠమహేశ్వర, సురమాంబదేవి, వనం ఎల్లమ్మ, వనం మైసమ్మ గౌడ కులదేవతల విగ్రహ స్థిర ప్రతిష్ఠ, కళ్యాణ మహోత్సవం ఐదు రోజులపాటు అపూర్వమైన ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా నిర్వహించబడింది.

ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సాగిన ఈ మహోత్సవం భక్తిజనాలతో కళకళలాడుతూ గ్రామాన్ని పుణ్యక్షేత్రాన్ని తలపించేలా మార్చింది.మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read Also:Hyderabad: ఇకపై విడి నూనె అమ్మితే జైలుకే

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ధార్మిక వేడుకలు మన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని, సమాజంలో ఐక్యతా భావం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. గౌడ కులదేవతల ఆరాధనకు విశిష్ట స్థానం ఉందని, ఆ భక్తి సంప్రదాయాన్ని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు.మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు సమిష్టిగా కృషి చేశారు.

Madgul Village Festivals: సంప్రదాయాలకు ప్రతీక ఈ వేడుకలు – గోలి శ్రీనివాస్ రెడ్డి

అన్నదాన కార్యక్రమాలు, భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దూర ప్రాంతాల నుంచి భారీ సంయలో తరలివచ్చిన భక్తులు దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.దేవతల కృపతో గ్రామంలో సస్యశ్యామలత్వం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలని కోరుతూ నిర్వాహకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తి, సంప్రదాయం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ మహోత్సవం గ్రామ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మాడ్గుల మండల పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, వెల్డండ మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, మాజీ సర్పంచులు పవన్ కుమార్ రెడ్డి, కృష్ణారెడ్డి, రమేష్ రెడ్డి, యాదిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ పట్టాభి తిరుమల్ రెడ్డి, నారాయణ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురమల్ల సుభాష్, జెల్ల యాదయ్య, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

రంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి బాధ్యతల స్వీకరణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha