Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భర్త కనిపిచడంలేదంటూ పోలీసులుకు ఫిర్యాదు.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్

భర్త కనిపిచడంలేదంటూ పోలీసులుకు ఫిర్యాదు.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్

వార్త 2 weeks ago

Miyapur Husband Murder Case: దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా భర్తలను భార్యలే దారుణంగా హతమార్చుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

తాజాగా భాగ్యనగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమిది నెలల క్రితం నమోదైన ఒక మిస్సింగ్ కేసు.. చివరకు భార్యే చేసిన కిరాతక హత్యగా తేలి సంచలనం సృష్టించింది. పరాయి వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను చంపి, శవాన్ని అంతరాష్ట్ర సరిహద్దులు దాటించి ఏమీ ఎరగనట్టు నాటకమాడిన కిలాడీ లేడీ గుట్టును పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు.

Read Also :Nizamabad Harpic Murder:'హార్పిక్' ఇంజక్షన్‌తో భర్త ప్రాణం హరించింది..

గతేడాది నవంబర్‌లో మిస్సింగ్ నాటకం

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన ఒక వ్యక్తి గతేడాది నవంబర్ నెలలో అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. దీనిపై అతడి భార్యే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన భర్త కనిపించడం లేదంటూ కన్నీరుమున్నీరవుతూ ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు అప్పట్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నెలలు గడుస్తున్నా అతడి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు అనుమానంతో కేసును లోతుగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు.

సీడీఆర్, సీసీటీవీలతో దొరికిపోయిన భార్య

ఈ క్రమంలో పోలీసులు సదరు మహిళ యొక్క కాల్ డేటా రికార్డులను (CDR), అలాగే ఆ సమయంలో వారి నివాస ప్రాంతంలో ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సాంకేతిక విశ్లేషణలో పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే నిజాలు తెలిసొచ్చాయి. భార్యే తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా నవంబర్‌లోనే హతమార్చినట్లు తేలింది. హత్య అనంతరం ఎలాంటి ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతో శవాన్ని ఒక వాహనంలో రాత్రికి రాత్రే మహారాష్ట్ర సరిహద్దుల (బార్డర్) వరకు తరలించారు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గుంత తవ్వి పూడ్చిపెట్టినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిర్ధారించుకున్నారు.

Miyapur Husband Murder Case: శవాన్ని వెలికితీసిన పోలీసులు – దర్యాప్తు ముమ్మరం

సాంకేతిక ఆధారాలతో భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు తమదైన శైలిలో అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు మహారాష్ట్రలోని స్థానిక పోలీసుల సహాయంతో సరిహద్దు ప్రాంతానికి వెళ్లి, పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. అక్కడే శవపరీక్ష (Post-Mortem) నిర్వహించి ఆధారాలు సేకరించారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

జనగామలో రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య.. నా చావుకు వీరే కారణమంటూ లేఖ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha