Dailyhunt
భర్త పైశాచికత్వం! డబ్బు కోసం భార్యను 120 మందికి అమ్మేసిన ఘనుడు

భర్త పైశాచికత్వం! డబ్బు కోసం భార్యను 120 మందికి అమ్మేసిన ఘనుడు

వార్త 2 weeks ago

Sweden Pelicot Case: మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి, స్వీడన్‌లో కట్టుకున్న భార్యనే కాసుల కోసం అమ్మకానికి పెట్టాడో భర్త. అమ్మకానికి పెట్టడమే కాదు..

కేవలం డబ్బు కోసం తన భార్యను సుమారు 120 మంది పురుషులకు అప్పగించి, ఆ డబ్బుతో జల్సా చేసిన ఒక 62 ఏళ్ల వ్యక్తిపై స్వీడన్ ప్రాసిక్యూటర్లు సోమవారం అభియోగాలు నమోదు చేశారు. గతంలో ఫ్రాన్స్‌లో గిసెల్ పెలికోట్ అనే మహిళను ఆమె భర్త డ్రగ్స్ ఇచ్చి వందలాది మందితో అత్యాచారం చేయించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు స్వీడన్‌లో జరిగిన ఈ దారుణాన్ని స్థానిక మీడియా ‘స్వీడిష్ పెలికోట్ కేసు’గా అభివర్ణిస్తోంది. నిందితుడు గతంలో ‘హెల్స్ ఏంజెల్స్’ అనే బైకర్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉన్నట్లు సమాచారం. ఉత్తర స్వీడన్‌లో నివసిస్తున్న ఈ వ్యక్తి, భార్య బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

Read Also : Bangalore Crime: బెంగళూరులో టెకీ జంట ఆత్మహత్య.. మానసిక ఒత్తిడే కారణమా?

 Husband sells wife to 120 people!

Sweden Pelicot Case: డ్రగ్స్ అలవాటును ఆసరాగా చేసుకుని..

ఉత్తర స్వీడన్‌లో నివసిస్తున్న ఈ వ్యక్తి తన భార్యకు ఉన్న డ్రగ్స్ అలవాటును ఆసరాగా చేసుకుని ఆమెను వ్యభిచార కూపంలోకి నెట్టాడు. ఆమెకు డ్రగ్స్ సరఫరా చేస్తూ.. డబ్బు కోసం ఇతర పురుషులతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేసేవాడు. ఆన్‌లైన్ వేదికల ద్వారా విటులను రప్పించేవాడు. ఈ దారుణం 2022 ఆగస్టు నుంచి 2025 అక్టోబర్ వరకు నిరాటంకంగా కొనసాగింది. మహిళ నిరాకరించినప్పుడు “నాలోని రాక్షసుడిని నిద్రలేపుతా” అంటూ భయపెట్టి, ఆమె సమ్మతి లేకుండానే బలవంతంగా పరాయి వ్యక్తులకు అప్పగించేవాడు.

120 మంది విటులపై విచారణ

చివరకు భరించలేకపోయిన బాధిత మహిళ గత ఏడాది అక్టోబర్‌లో పోలీసులను ఆశ్రయించడంతో ఈ రాక్షసపర్వం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిపై ఎనిమిది అత్యాచారాలు, నాలుగు అత్యాచార యత్నాలు, వ్యభిచార కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 120 మంది పురుషులు ఈ మహిళ నుంచి లైంగిక సేవలు పొందినట్లు అధికారులు గుర్తించారు. స్వీడన్ లింగ సమానత్వ శాఖ మంత్రి నీనా లార్సన్ ఈ ఘటనను అత్యంత అసహ్యకరమైనదిగా అభివర్ణించారు. మనుషుల శరీరాలను కొనడం, అమ్మడం తక్షణమే ఆగిపోవాలని ఆమె అభిప్రాయ పడ్డారు. ప్రాసిక్యూటర్లు పక్కా ఆధారాలతో కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. బాధితురాలు తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆమె తరపు న్యాయవాది తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

అమెరికా సైనికులు వస్తే నిప్పుల వర్షం కురిపిస్తాం: ఇరాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha