AP Capital Bill Lok Sabha: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తి చట్టబద్దత కల్పిస్తూ.. లోక్ సభ బిల్లుకు ఆమోదం తెలపడం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
రాజధాని విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ.. అవమానాలకు ముగింపు పలుకుతూ.. బలమైన భవిష్యత్ కు అవకాశం ఇచ్చేలా తాజా బిల్లు లబ్ది చేకూర్చుతుందని అన్నారు. చరిత్రలో నిలచిపోయే బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంలో.. రాజధాని కోసం పోరాటం చేసిన ప్రతీ ఒక్కరి శ్రమకు ఫలితం లభిచినట్లు అయిందని.. వారందరికీ ఈ విజయం అంకితం ఇస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపేలా పూర్తి తోడ్పాటు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకు, హోమంత్రి అమిత్ షా కు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read Also:MLA Amilineni: అమరావతికి చట్టబద్ధ హోదా.. చారిత్రాత్మక నిర్ణయం
Amaravati Capital Bill Lok Sabha Approval 2026
AP Capital Bill Lok Sabha: వైసీపీ ఎంపీలపై రామ్మోహన్ నాయుడు ఫైర్
ఇంకోవైపు చరిత్రలో నిలచే బిల్లుకు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వకుండా వైసిపి పార్లమెంట్ సభ్యులు.. వాకౌట్ చెయ్యడం.. వారి విద్వంస వైఖరిని మరోసారి స్పష్టం చేసిందని ఎద్దేవా చేశారు. ప్రపంచ స్థాయి నగరాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మిస్తూ ఉంటె.. అమరావతిని ఓ స్కాం గా జగన్మోహన రెడ్డి అభివర్ణించడం అయన అజ్ఞానాన్ని, రైతులపై ఉన్న అసూయను స్పష్టం చేస్తోందని స్పష్టం చేశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా.. నిజాలు తెలిసిన ప్రజలు.. కూటమితో కలసి అభివృద్ధి వైపు నడవడానికే మొగ్గు చూపుతున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. లోక్ సభ మద్దతుతో మరింత వేగంగా ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి త్వరలోనే రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
(కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి క్యాంప్ కార్యాలయం, శ్రీకాకుళం)
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

