Dailyhunt
లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై లోకేశ్ హర్షం

లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై లోకేశ్ హర్షం

వార్త 2 weeks ago

Nara Lokesh: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అత్యంత హర్షం వ్యక్తం చేశారు.

ఈ చారిత్రక ఘట్టాన్ని ఆయన టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. బిల్లు ఆమోదం పొందిన వెంటనే చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని పంచుకున్న లోకేశ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ పురందేశ్వరి ప్రసంగాలను తన ఫోన్‌లో వీడియో తీసుకుంటూ మురిసిపోయారు.

Read Also: Kishan Reddy: అమరావతి బిల్లుకు తెలంగాణ బీజేపీ మద్దతు.. లోక్‌సభలో కిషన్ రెడ్డి

 Amaravati victory.. Lokesh happy over the passage of the bill in the Lok Sabha.

Nara Lokesh: నా రాష్ట్రం ఏపీ.. నా రాజధాని అమరావతి

ఈ సందర్భంపై లోకేశ్ స్పందిస్తూ ఇది ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే రోజు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నా రాజధాని అమరావతి అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునే రోజు ఇది అని అభివర్ణించారు. అమరావతి రైతుల త్యాగాలకు దైవ ఆశీస్సులు లభించాయని, వారి శాంతియుత పోరాటానికి నేడు పార్లమెంటు వేదికగా గుర్తింపు దక్కిందని ఆయన పేర్కొన్నారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అనే ఆకాంక్ష నెరవేరినందుకు ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. అమరావతి బిల్లుకు మద్దతుగా నిలిచిన కేంద్ర ప్రభుత్వానికి, ఇతర పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా అమరావతి నిలిచిందని పేర్కొంటూ, “జై ఆంధ్రప్రదేశ్.. జయహో అమరావతి” అని నినదించారు.

అమరావతి చట్టబద్దత బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చ మొత్తం టీవీలో చూశాను. ఉత్కంఠ రేపింది. అమరావతి చరిత్ర-సంస్కృతి, ఆవశ్యకత సభ్యులు వివరిస్తుంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం, దేశంలోని వివిధ పార్టీలు నిలవడం ఐదుకోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టింది. అమరావతి చట్టబద్ధత బిల్లు చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడం వారి ద్రోహబుద్ధికి నిదర్శనం. జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకనూ తాకలేడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధినీ ఆపలేడు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం అంటూ లోకేశ్ పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అమరావతి రాజధాని బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha