Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భివండిలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. ఆరుగురు మృతి!

భివండిలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. ఆరుగురు మృతి!

వార్త 1 week ago

Bhiwandi Building Collapse: మహారాష్ట్రలోని థానే జిల్లా భివండి లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక నాలుగు అంతస్తుల నివాస భవనం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా కుప్పకూలింది.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) మరియు రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశాయి.

Read Also :Anantapur Road Accident: లారీని ఢీ కొన్న కారు.. కారు దగ్ధం కావడంతోఓ వ్యక్తి సజీవ దహనం

ప్రమాదం ఎలా జరిగింది?

బుధవారం అర్ధరాత్రి భవనంలో మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భవనం ఒకవైపునకు ఒరిగినట్లు గుర్తించారు. ప్రమాదాన్ని పసిగట్టిన కొందరు కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీయడంతో పాటు, ఒక మహిళను సజీవంగా రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తిని పడుకున్న సమయంలో భారీ శబ్దం రావడంతో మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నామని బాధితులు తెలిపారు. మరికొందరు తమ కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారని ఆందోళన చెందుతున్నారు.

Bhiwandi Building Collapse: సహాయక చర్యలకు ఎదురవుతున్న ఆటంకాలు

సదరు భవనంలో సుమారు 45 గదులు ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 25 నుంచి 30 మంది భవనంలో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. భవనానికి సంబంధించిన కాంక్రీట్ శిథిలాలు భారీగా పేరుకుపోవడంతో NDRF, SDRF సిబ్బందికి రెస్క్యూ చర్యల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha