Anantapur Road Accident: అనంతపురం జిల్లా గుత్తి మండలంలో 63వ జాతీయ రహదారిపై గురువారం లారీని వెనకవైపు నుండి కారు ఢీకొంది. ఈ సంఘటనలో కారు అగ్ని ప్రమాదానికి గురైంది.ఈ సంఘటనలో తెలంగాణ రాష్ట్రం కు చెందిన ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు.
Read Also : AP govt employees salary: గుడ్ న్యూస్.. జీతాలు ఇకపై ఒకటో తేదీనే
Car Collides with Lorry; Person Burnt Alive as Vehicle Catches Fire
Anantapur Road Accident: ప్రమాదం జరిగిన తీరు, వివరాలు
వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మరికల్ మండలం బుడేగాన్ తండా,కు చెందిన రవి నాయక్, గాజుల తాండకు చెందిన లక్ష్మణ్ నాయక్, రవి నాయక్ లు టయోటా ఎటియెస్ కారులో తాడిపత్రి నుండి గుత్తి వైపు వస్తున్నారు.. ఎంగిలిబండ గ్రామ క్రాస్ వద్ద ముందువైపు వెళుతున్న లారీని వేగంగా ఢీకొంది. లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చునని ప్రాథమికంగా నిర్ధారించారు.
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న డీజిల్ క్యాన్లు కు నిప్పంటు కోవడంతో అగ్నిప్రమాదం సంభవించింది.ఈ సంఘటనలో రవి నాయక్ కారులోనే సజీవ దహనం అయ్యాడు.. మిగతా ఇద్దరు తప్పించుకొని పరారీ అయ్యారు.. రహదారులలో నిలిపి ఉన్న వాహనాలలో ఉన్న డీజల్ ను తస్కరించే చోరుల ముఠాగా తెలుస్తోంది.. సంఘటన స్థలిని అర్బన్ సీఐ రామారావు పరిశీలించారు.. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పరీక్షల లీకేజీల నిరోధక బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. కేంద్ర నిర్ణయంపై లోకేశ్ హర్షం

