Dailyhunt
భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడీ..మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన!

భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడీ..మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన!

వార్త 2 weeks ago

Bhogapuram Airport: విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు దాదాపు పూర్తికావచ్చాయి. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం విమానాశ్రయ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై లేదా ఆగస్టు నెలల్లో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. జూలై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీలను ప్రారంభోత్సవానికి పరిశీలిస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీనిని ప్రారంభించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

Read Also:Vizag Crime: మ్యాచ్ ముగిసినా కక్ష చావలేదు.. నడిరోడ్డుపై ప్రాణం తీశాడు!

 BC Janardhan Reddy reviews progress with GMR representatives; Bhogapuram works in final stages.

98 శాతం పనులు పూర్తి.. అత్యాధునిక సాంకేతికతతో నిర్మాణం

భోగాపురం విమానాశ్రయంలో ఇప్పటికే 98 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఎర్త్ రన్‌వే పనులు 100 శాతం పూర్తి కాగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) పనులు 95 శాతం ముగిశాయి. ఈ విమానాశ్రయాన్ని అత్యంత పటిష్టంగా, గంటకు 280 కిలోమీటర్ల వేగంతో వీచే తుఫాను గాలులను సైతం తట్టుకునేలా నిర్మిస్తున్నారు. భారీ వర్షం కురిసినా నీరు నిల్వ ఉండకుండా అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో ఈ టెర్మినల్ సిద్ధమవుతోంది.

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర దశ మార్చనున్న ‘గేమ్ ఛేంజర్’

ఈ గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ఆర్థిక కేంద్రంగా అవతరించనుంది. 24 గంటల విమాన సర్వీసులు, అంతర్జాతీయ కనెక్టివిటీతో పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే జనవరిలో ఎయిర్ ఇండియా విమానంతో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరడమే కాకుండా, రాష్ట్రంలో మరో ఆరు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలపండి.. మంత్రి తుమ్మల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha