Bhogapuram Airport Uttandhra: కేంద్ర మంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, కూటమి విజయంలో కీలక భూమిక పోషించిన ప్రతి కార్యకర్తకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
మంగళవారం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం రాపాక గ్రామంలో రూ. కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే (పీయూసీ చైర్మన్) కూన రవికుమార్‌లతో కలిసి ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Read Also: Botsa Satyanarayana: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్లే ప్రమాదాలు.. బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు!
వెంకటరాయుని గూడెంలో రూ. 10.45 కోట్లతో ఎంఎస్‌ఎంఈ (MSME) పార్కుకు శంకుస్థాపన చేసిన అనంతరం, రాపాకలో రూ. 2.20 కోట్లతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, వెల్నెస్ సెంటర్, తాగునీటి సరఫరా యూనిట్లను ప్రారంభించి, రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.
శ్రీకాకుళం ఇక వలసల జిల్లా కాదు..!
సభా వేదికపై సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాను వలసలు వెళ్లే జిల్లా నుంచి.. ఇతర ప్రాంతాల వారు వలసలు వచ్చే జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు.
“ఉత్తరాంధ్రను.. ఉత్తమాంధ్రగా మార్చబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మన జిల్లాకు అత్యంత సమీపంలో ఉంది. దీనివల్ల శ్రీకాకుళానికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. వి.ఆర్.గూడెం ఎంఎస్‌ఎంఈ పార్కులో సైతం టాప్ కంపెనీలు వచ్చేలా కృషి చేస్తాం.” - కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి.

Bhogapuram Airport Uttandhra: శ్రీకాకుళం టూ హైదరాబాద్.. మరిన్ని కొత్త రైళ్లు!
గడిచిన రెండేళ్లలో రైల్వే జోన్, కేంద్రీయ విద్యాలయ, నేరడి ప్రాజెక్ట్ సాధించడంతో పాటు పొందూరు ఖాదీకి జీఐ (GI) ట్యాగ్ తీసుకువచ్చామని మంత్రి గుర్తుచేశారు. భవిష్యత్తులో శ్రీకాకుళం నుంచి హైదరాబాద్, వారణాసి, గుజరాత్, చెన్నైలకు కొత్త రైళ్లు నడిపే ఆలోచన ఉందన్నారు. అలాగే స్థానికుల కోరిక మేరకు పొందూరు స్టేషన్‌లో హంసఫర్, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా (స్టాపేజ్) కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి:
కూటమి ప్రభుత్వం పింఛన్లు, స్త్రీ శక్తి, తల్లికి వందనం, దీపం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్తుంటే.. వైఎస్సార్సీపీ నేతలు మెగా డీఎస్సీపై గందరగోళం సృష్టిస్తూ మళ్లీ చిందరవందర చేయాలని చూస్తున్నారని, ప్రజలు వారిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై స్పందిస్తూ.. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

