Dailyhunt
భూమన నేతృత్వంలో మత మార్పిడి

భూమన నేతృత్వంలో మత మార్పిడి

వార్త 2 weeks ago

Tirupati: టీటీడీ మాజీ చైర్మన్‌, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో ముస్లిం దంపతులు హిందూ మతాన్ని స్వీకరించారు. తిరుపతికి చెందిన అబ్దుల్లా, అమ్మిన్నా దంపతులను వేద మంత్రోచ్ఛరణల మధ్య హిందూ మతంలోకి మార్చడం విశేషం.

Read Also: Withdrawal of Property Tax Hike: ఆస్తి పన్ను పెంపు ఉపసంహరించుకోవాలి.. బాబూరావు

27 ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చి మత మార్పు

ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఒక జంట తిరిగి హిందూ మతం స్వీకరించేలా చర్యలు తీసుకున్నారు. తిరుపతికి చెందిన యాలమూరి శ్రీనివాస్‌రెడ్డి, పుష్ప దంపతులు కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడే 27 ఏళ్ల పాటు ఉన్నారు. ఈ క్రమంలో ముస్లిం మతాన్ని స్వీకరించారు. శ్రీనివాస్‌రెడ్డి తన పేరును అబ్దుల్లాగా, అలాగే ఆయన బార్య పుష్ప తన పేరును అమ్మిన్నాగా మార్చుకున్నారు. ముస్లిం పేర్లతోనే అన్ని రకాల కార్డులను సృష్టించుకున్నారు.

 Tirupati: Religious conversion led by Bhumana

2015లో వారు ఇండియా తిరిగొచ్చారు. తిరుపతి పెద్దకాపు వీధిలో అబ్దుల్లా కుటుంబం నివాసం వుంటోంది. ఈ విషయం తెలుసుకున్న భూమన కరుణాకరెడ్డి అబ్దుల్లా ఇంటికి వెళ్లారు. పలుమార్లు చర్చించారు. హిందూ మత విశిష్టను వారికి వివరించారు. దీంతో భూమన నేతృత్వంలో హిందూ మతం స్వీకరించేందుకు అబ్దుల్లా, ఆయన భార్య అమ్మిన్నా ముందుకు వచ్చారు.

వేద పండితుల మధ్య కార్యక్రమం

ఈ నేపథ్యంలో హిందూ మత పునఃస్వీకరణ మహోత్సవానికి తిరుపతిలో భూమన నివాస ఆవరణం వేదికైంది. గురువారం వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య అబ్దుల్లా, అమ్మిన్నా హిందూ మతాన్ని స్వీకరించారు. తిరిగి తమ పేర్లను శ్రీనివాస్‌రెడ్డి, పుష్పగా మార్చుకోవడం విశేషం. కేవలం భూమన కరుణాకరరెడ్డి హిందూ మతం గొప్పతనాన్ని చాటి చెప్పి, తిరిగి తమతో స్వీకరించేలా చేశారని దంపతులిద్దరూ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది మొదటి హిందూ మత స్వీకరణ కావడం విశేషం.

ఇదిలా వుండగా టీటీడీ చైర్మన్‌గా భూమన ఉన్న సమయంలో తిరుమల ఆస్థాన మండపంలో 90 మంది పీఠాధిపతులు, మఠాధిపతుల నేతృత్వంలో నిర్వహించిన వేద విద్వత్ సదస్సులో ఇతర మతాల నుంచి హిందూ మతంలో చేరేవారికి తిరుమల వేదికగా హిందూమత స్వీకరణ కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు. హిందూ మత స్వీకరణకు తిరుమల శ్రీవారిని దిక్సూచిగా చేయాలని భూమన ఆధ్వర్యంలో నాడు నిర్ణయించారు. ఇది ఆచరణలోకి రాకముందే వైసీపీ ప్రభుత్వం దిగిపోయింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

అగ్రికల్చర్ హబ్ గా రాయలసీమ.. మంత్రి సత్యప్రసాద్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha