TG Land Market Value: మూడు శ్లాబుల్లో మార్కెట్ విలువలను పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.2 వేల కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021, 2022లో రెండు విడతలుగా భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు సవ రించింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వ్యవ సాయ, వ్యవసాయేతర భూములు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. గడిచిన నాలుగేళ్లలో స్థిరాస్తుల విలువలు భారీఎత్తున పెరిగినా ప్రభుత్వం మార్చలేదు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ మార్కెట్, బహిరంగ మార్కెట్ విలువల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో భా గంగా అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది. గత నెల రోజులుగా కొనసా గుతున్న కసరత్తు పూర్తైనట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Read also: Prakash Raj vs Pawan : పవన్ కళ్యాణ్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్లు
Revenue of over Rs. 2,000 crore due to increase in land market value
TG Land Market Value: క్షేత్రస్థాయి అధ్యయనం – కేటగిరీల విభజన
రాష్ట్రవ్యా ప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ‘రివిజన్ ఆఫ్ మార్కెట్ వాల్యూస్ గైడ్లైన్స్ కమిటీలు’ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశాయి. జాతీయ రహదారులు, వెడల్పాటి రోడ్లు 30 అడుగుల కన్నా ఎక్కువ 100 అడుగులవరకు రహదారులు ఉన్న ప్రాంతాలు వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు, పట్టణ విస్తరణ ప్రాంతాలు వంటి వివిధ కేటగిరీలుగా ప్రాంతా లను విభజించారు. అక్కడ అమల్లో ఉన్న విలు వలను అధికారులు పరిశీలించారు. బహిరంగ, మార్కెట్ విలువల మధ్య భారీగా తేడా ఉన్నట్లు గుర్తించారు.
మూడు శ్లాబుల్లో పెంపు ప్రతిపాదనలు
రెండింటి మధ్య తక్కువ వ్యత్యాసం ఉన్న ప్రాంతాల్లో 25 శాతం, ఎక్కువ వ్యత్యా సం ఉన్న ప్రాంతాల్లో 50 శాతం, వాణిజ్య పరంగా వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో 100 శాతం వరకు విలువలు పెంచాలని కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. ఇళ్ల స్థలాలు, భవ నాలు, అపార్ట్మెంట్ల విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్, మార్కెట్ విలువలు, ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువలను పోల్చి 25 శాతం, 50శాతం, 100 శాతం, మూడు కేటగిరీల్లో పెంపు ప్రతిపాదనలు చేసినట్లు సమా చారం. గ్రామాలు, పట్టణాలు, వార్డులు యూని ట్లుగా తీసకొని సగటు మార్కెట్ విలువలను ఆధారంగా పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అధి కారులు వెల్లడిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రూపొం దించిన ఆ వేదికలను 144 సబ్ రిజిస్ట్రార్ కార్యా లయాల నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమి షనర్కు పంపించారు.
నివేదికలను హైదరా బాద్ లోని ఐజీ కార్యాలయంలో అదనపు ఐజీలు, జాయింట్ ఐజీలు, జిల్లా రిజిస్టర్లు, పలువురు సబ్ రిజిస్ట్రార్లు గత కొన్ని రోజులుగా సమీక్షిం చినట్లు సమాచారం. గతంలో మాదిరిగా కాకుం డా ఈసారి క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహనతో, పారదర్శకంగా మార్కెట్ విలువల సవరణ ప్రక్రి య చేపట్టినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధి కారులు పేర్కొంటున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

