Prakash Raj vs Pawan : తెలంగాణ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతోందంటూ ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ పరిణామంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందిస్తూ పవన్ కళ్యాణ్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. గత కొంతకాలంగా సామాజిక, రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే ప్రకాశ్ రాజ్.. ఈసారి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల ప్రకటనను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా పవన్‌ను ఉద్దేశించి చేసిన ఒక ఆసక్తికర ట్వీట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
Read Also : పవన్ సమక్షంలో జనసేనలోకి గడల శ్రీనివాసరావు

'రండి దొర.. కానీ ఎలా వస్తున్నారో చెప్పండి'
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ.. “మీరొస్తానంటే మేమొద్దంటామా? రండి దొర. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగిల్గా వస్తున్నారా? అది చెప్పి రండి” అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల బరిలోకి దిగినప్పుడు ఇతర పార్టీలతో పెట్టుకున్న పొత్తులు, తీసుకున్న యూ-టర్న్‌లను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తెలంగాణలో ఒంటరిగా బరిలోకి దిగుతారా లేక ఏపీ తరహాలోనే ఇక్కడ కూడా బీజేపీ లేదా ఇతర మిత్రపక్షాలతో కలిసి నడుస్తారా అనే విషయాన్ని ముందే స్పష్టం చేయాలంటూ ఆయన డిమాండ్ చేయడం జనసేన శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

