Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లకు వర్తించే మార్కెట్ విలువల సవరణకు ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టింది.
ఈ సవరించిన కొత్త భూముల విలువలు జూన్ 5వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దాదాపు ఏడాది విరామం తర్వాత రిజిస్ట్రేషన్ ధరల్లో ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద మార్పుగా దీనిని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని వివిధ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు, మార్కెట్ అధ్యయనాలు, అధికారుల నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ప్రభుత్వం నోటిఫై చేస్తున్న రేట్లు, ఓపెన్ మార్కెట్‌లో ఉన్న వాస్తవ ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో, ఆ గ్యాప్‌ను తగ్గించడమే ఈ సవరణ యొక్క ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. వ్యవసాయ భూములు, నాన్-అగ్రికల్చరల్ ఆస్తులు రెండింటికీ వర్తించేలా ఈ కొత్త ధరలను నాలుగు కేటగిరీలుగా విభజించారు.
Read Also: Prakash Raj vs Pawan : పవన్ కళ్యాణ్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్లు
Ponguleti Srinivas Reddy
Ponguleti Srinivas Reddy: ధరల పెంపు మొదటి మూడు కేటగిరీల పరిధిలోనే పరిమితం
అయితే రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో ధరల పెంపు మొదటి మూడు కేటగిరీల పరిధిలోనే పరిమితం కానుంది. అత్యంత డిమాండ్ ఉన్న కోర్ అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే గరిష్ట పెంపు అమలు చేయనున్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న భూములు, జాతీయ రహదారులు, రేడియల్ రోడ్లకు ఆనుకుని ఉన్న స్థలాలు, అలాగే కోకపేట్, రాయదుర్గం వంటి హై-ఎండ్ ఐటీ కారిడార్లలో ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని సుమారు 10 శాతం ప్రాంతాల్లో ఎలాంటి సవరణ చేయకుండా పాత ధరలనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. .. క్షేత్రస్థాయి సర్వేల్లో నగరంలోని కొన్ని ప్రధాన అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారిక రేట్లకు, వాస్తవ మార్కెట్ ధరలకు మధ్య 500 నుంచి 600 శాతం వరకు వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో అధికారులు తొలుత భారీగా ధరలు పెంచాలని ప్రతిపాదించారు. అయితే దీనివల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడే అవకాశం ఉందని, రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. గరిష్టంగా వంద శాతానికి మించి పెంపు ఉండకూడదని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

