Bhadradri Kothagudem crime: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం నర్సాపురం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని జాహ్నవి బుధవారం తన నివాసంలోనే ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది.
నిండు నూరేళ్ల భవిష్యత్తు ఉన్న యువతి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Read Also: Moinabad Farmhouse Drugs Case: నిర్మాత కేదార్, రోహిత్ మధ్య డ్రగ్స్ సంబంధాలు!
Inter student commits suicide by hanging herself at home
Bhadradri Kothagudem crime: ఎవరూ లేని సమయంలో అఘాయిత్యం
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి జాహ్నవి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. పని నిమిత్తం బయటకు వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేసరికి ఆమె విగతజీవిగా కనిపించింది. వారు వెంటనే గమనించినప్పటికీ, అప్పటికే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. జాహ్నవి మరణవార్త విన్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కారణాలపై పోలీసుల ఆరా
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జాహ్నవి ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. చదువులో ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకుందా లేక మరేదైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

