Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీ ఆధ్వర్యంలో 'జనతా వారధి'

బీజేపీ ఆధ్వర్యంలో 'జనతా వారధి'

వార్త 3 months ago

‘మీ సమస్య.. మా బాధ్యత’ కు విశేష స్పందన.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్

BJP Andhra Pradesh: ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత చేరువగా ఉండే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమాన్ని జనవరి 5,2026, నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీయన్ మాధవ్ తెలిపారు.

ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల నుండి నేరుగా వినతులు, ఫిర్యాదులు, సమస్యలు, అర్జీలు స్వీకరించి, వాటిని సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం స్వీకరించిన సమస్యలను సోమవారం ఆయా జిల్లాలకు చెందిన అధికారులతో సమీక్షించి, వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వం, అధికార వ్యవస్థ మధ్య వారధిగా నిలవడమే జనతా
వారధి" కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు.

Read also: AP FTVTDC: ఏపీ సినీ రంగానికి కొత్త కళ.. చైర్మన్‌గా భరత్ భూషణ్!

BJP Janata Varadhi: Solving Public Issues Fast!

BJP Andhra Pradesh: పరిష్కారమైన వేలకొద్దీ ప్రజా సమస్యలు

జనతా వారధి” కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,248 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. వీటిలో భూ సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య సేవలు, విద్య, ఉపాధి, తాగునీటి సమస్యలు, రోడ్లు, రెవెన్యూ సంబంధిత అంశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అందిన అర్జీలలో సుమారు 2,180 సమస్యలు పరిష్కారమయ్యాయని, మరో 760 సమస్యలు సంబంధిత శాఖల పరిధిలో పరిష్కార దశలో ఉన్నాయని వెల్లడించారు. జనతా వారధి ద్వారా 486 పెన్షన్ సమస్యలు,312 రేషన్ కార్డు సమస్యలు, 228 భూ, రెవెన్యూ సమస్యలు పరిష్కార దశకు చేరుకున్నాయన్నారు.174 తాగునీరు, మోలిక వసతుల సమస్యలు, 142 విద్య, ఉపాధి సంబంధిత సమస్యలు, 96 ఆరోగ్య సేవలకు సంబంధించిన అర్జీలు పరిష్కరించబడ్డాయని తెలిపారు ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయ వారధిగా నిలవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పీవీయన్ మాధవ్ పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

జగన్‌కు ఛీటింగ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చు:నారా లోకేష్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha