Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీరు సీసాలో కండోమ్ ప్యాకెట్..మందుబాబు కు షాక్

బీరు సీసాలో కండోమ్ ప్యాకెట్..మందుబాబు కు షాక్

వార్త 5 days ago

తెలంగాణలో భానుడి భగభగలకు తట్టుకోలేక, కాస్త చల్లటి బీరు తాగి ఉపశమనం పొందుదామనుకున్న ఒక మద్యం ప్రియుడికి నమ్మలేని వింత అనుభవం ఎదురైంది. సీసా మూత తీసే ముందే లోపల ఉన్న వస్తువును చూసి అతడు ఒక్కసారిగా కంగుతిన్నాడు.

సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండల కేంద్రంలోని ఒక వైన్ షాపులో ఈ విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. సదరు వ్యక్తి సమ్మర్ హీట్‌ను తట్టుకోవడానికి సదరు వైన్స్ లో ఒక ‘కింగ్ ఫిషర్ లైట్’ (Kingfisher Light) బీర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. అయితే, తాగే ముందు అనుమానం వచ్చి బాటిల్‌ను నిశితంగా పరిశీలించగా, అందులో మద్యం లోపల ఒక ఖాళీ కండోమ్ ప్యాకెట్ తేలుతూ కనిపించింది. దీంతో సదరు మందుబాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.

Read Also : మా పాదయాత్రకు భయపడే హడావిడి సమీక్షలు!

వైన్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం.. ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు!

ఈ దారుణమైన కల్తీ వ్యవహారంపై సదరు వినియోగదారుడు వెంటనే సదరు వైన్ షాపు యజమానులను, సిబ్బందిని నిలదీశాడు. అయితే, మద్యం కంపెనీ ప్యాకింగ్ లోపమా లేక వైన్స్ వారి నిర్లక్ష్యమా అన్న కోణంలో సమాధానం చెప్పాల్సింది పోయి, నిర్వాహకులు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. షాపు వారి నుండి ఎలాంటి సరైన స్పందన లేకపోవడంతో సదరు బాధితుడు సాక్ష్యంగా ఉన్న బీరు బాటిల్‌ను తీసుకొని నేరుగా ఎక్సైజ్ శాఖ పోలీసులను ఆశ్రయించాడు. బీరు సీసాలో కండోమ్ ప్యాకెట్ ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రజారోగ్యంతో ఆటలాడుతున్న సదరు బ్రేవరేజ్ కంపెనీపై, వైన్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పాలమూరు ప్రాజెక్టు ఆపేది లేదు:ఉత్తమ్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha